Telangana: అమానుషం.. బత్తాయి కాయలు కోసిందని చిన్నారిని గొలుసులతో కట్టేశారు..

గద్వాల జిల్లా విఠలపురంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. చిన్నారిని గొలుసులతో కట్టేశారు బత్తాయి తోట యజమానులు. ఇంత శిక్ష విధించడానికి కారణం.. ఆ చిన్నారి ఓ బత్తాయిని కోయడమే. అవును, బత్తాయిలు కోసిందనే కారణంతో దారుణానికి పాల్పడ్డారు తోట యజమానులు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు తోట యజమానులతో వాగ్వాదానికి దిగారు.

Telangana: అమానుషం.. బత్తాయి కాయలు కోసిందని చిన్నారిని గొలుసులతో కట్టేశారు..
Child Tied With Chains
Follow us
Shiva Prajapati

|

Updated on: May 07, 2023 | 1:46 PM

గద్వాల జిల్లా విఠలపురంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. చిన్నారిని గొలుసులతో కట్టేశారు బత్తాయి తోట యజమానులు. ఇంత శిక్ష విధించడానికి కారణం.. ఆ చిన్నారి ఓ బత్తాయిని కోయడమే. అవును, బత్తాయిలు కోసిందనే కారణంతో దారుణానికి పాల్పడ్డారు తోట యజమానులు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు తోట యజమానులతో వాగ్వాదానికి దిగారు. పదేళ్లు కూడా నిండని ఆ చిన్నారిని.. ఏదో ఖైదీని బంధించినట్లుగా చేతులకు గొలుసులు కట్టేసి బంధించారు. అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

తమ కుమార్తెను కట్టేసిన విషయం తెలిసి తోటకు వెళ్లిన తల్లిదండ్రులు ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. తోట యజమానురాలితో గొడవ పడ్డారు. కాయలు కోసినందుకు మందలించి తమతో చెప్తే బాగుండేదని.. అలా కాకుండా ఇనుప గొలుసులతో కట్టేయడం ఏంటని ప్రశ్నించారు. స్థానికులు సైతం తోట యజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..