AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Polytechnic Lecturer Exam Date: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల రాతపరీక్షలకు కొత్త షెడ్యూల్‌ విడుదల.. ఏయే తేదీల్లోనంటే..

తెలంగాణ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్లు, సాంకేతిక, ఇంటర్మీడియట్‌ విద్యలో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి మూ నెలలో నిర్వహించనున్న రాతపరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ రీషెడ్యూల్‌ చేసింది. ఈ పరీక్షలను సెప్టెంబరు 4, 5, 6, 8, 11 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో..

TS Polytechnic Lecturer Exam Date: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల రాతపరీక్షలకు కొత్త షెడ్యూల్‌ విడుదల.. ఏయే తేదీల్లోనంటే..
TSPSC Polytechnic Lecturer Exam Revised Schedule 2023,
Srilakshmi C
|

Updated on: May 07, 2023 | 1:32 PM

Share

తెలంగాణ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్లు, సాంకేతిక, ఇంటర్మీడియట్‌ విద్యలో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి మూ నెలలో నిర్వహించనున్న రాతపరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ రీషెడ్యూల్‌ చేసింది. ఈ పరీక్షలను సెప్టెంబరు 4, 5, 6, 8, 11 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో సంబంధిత సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు కమిషన్‌ పరీక్షల రీషెడ్యూలు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్‌ పోస్టులకు, సాంకేతిక, ఇంటర్‌ విద్యలో 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తొలుత కమిషన్‌ తెలిపింది. ఐతే ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం సాధ్యమైనన్ని పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు కూడా సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు కొత్త షెడ్యూల్‌ను వెల్లడించింది.

పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల కొత్త షెడ్యూల్‌ ఇదే..

  • సెప్టెంబర్ 4:

ఉదయం పేపర్‌ 1.. జనరల్ స్టడీస్‌ అండ్ జనరల్ఎబిలిటీ మధ్యాహ్నం పేపర్ 2.. సివిల్‌ ఇంజనీరింగ్‌, టన్నరీ, జియాలజీ, ఫిజిక్స్‌

  • సెప్టెంబర్ 5:

దయం పేపర్‌ 1.. జనరల్ స్టడీస్‌ అండ్ జనరల్ఎబిలిటీ మధ్యాహ్నం పేపర్ 2.. మెకానికల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్‌

ఇవి కూడా చదవండి
  • సెప్టెంబర్ 6:

ఉదయం పేపర్‌ 1 .. జనరల్ స్టడీస్‌ అండ్ జనరల్ఎబిలిటీ మధ్యాహ్నం పేపర్ 2.. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, లెటర్‌ ప్రెస్ (ప్రింటింగ్‌ టెక్నాలజీ), మెటలర్జరీ, ఫార్మసీ, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్

  • సెప్టెంబర్ 8:

ఉదయం పేపర్‌ 1 .. జనరల్ స్టడీస్‌ అండ్ జనరల్ఎబిలిటీ మధ్యాహ్నం పేపర్ 2.. ఎలక్ట్రికల్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజనీరింగ్‌, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్, బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌, టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్

ఫిజికల్ డైరెక్టర్ల కొత్త పరీక్ష తేదీ ఇదే..

  • సెప్టెంబర్ 11: ఉదయం పేపర్‌ 1 జనరల్ స్టడీస్‌ అండ్ జనరల్ఎబిలిటీ మధ్యాహ్నం పేపర్ 2.. ఫిజికల్‌ ఎడ్యకేషన్‌

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.