Hyderabad: మండుటెండల్లో కూల్‌ కూల్‌గా.. ట్రాఫిక్‌ పోలీసులకు ప్రత్యేక హెల్మెట్లు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించడం మాములు విషయం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలే గజిబిజీగా ఉండే రోడ్లు, పైగా మండుటెండలు, తీవ్ర కాలుష్యం కారణంగా ట్రాఫిక్‌ పోలీసులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇలా ఎండలో కష్టపడి పని చేసే ట్రాఫిక్‌ పోలీసుల కష్టాలను తీర్చేందుకు రాచకోండ పోలీసులు..

Hyderabad: మండుటెండల్లో కూల్‌ కూల్‌గా.. ట్రాఫిక్‌ పోలీసులకు ప్రత్యేక హెల్మెట్లు.
Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: May 07, 2023 | 3:45 PM

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించడం మాములు విషయం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలే గజిబిజీగా ఉండే రోడ్లు, పైగా మండుటెండలు, తీవ్ర కాలుష్యం కారణంగా ట్రాఫిక్‌ పోలీసులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇలా ఎండలో కష్టపడి పని చేసే ట్రాఫిక్‌ పోలీసుల కష్టాలను తీర్చేందుకు రాచకోండ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు రాచకొండ పోలీసులకు ఎండ నుంచి రక్షణ కోసం ఏసీ హెల్మెట్లు అందించనున్నారు.. ప్రయోగాత్మకంగా కొంతమంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు వీటిని అందించారు.వీటి పనితీరును పరిశీలించిన తర్వాత మిగతా ట్రాఫిక్ కానిస్టేబుళ్లుకీ ఇస్తారు..ఈ హెల్మెట్లు ఎండ నుంచి కొంత మేరకు ఉపశమనం అందిస్తాయని.. వడదెబ్బ, ఎండ వేడి నుంచి ట్రాఫిక్ కానిస్టేబుళ్లను ఈ ఏసీ హెల్మెట్ కాపాడుతుందని మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు చెబుతున్నారు.

ఈ ఏసీ హెల్మెట్‌ ముందు భాగంలో బ్యాటరీ-సపోర్టెడ్ కూలింగ్ పాయింట్ ఉంటుంది. దీని ద్వారా చల్లని గాలి హెల్మెట్‌కు మూడు వైపుల నుండి ప్రవహిస్తుంది. ఈ హెల్మెట్‌లో ఉన్న బ్యాటరీని 30 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే మూడు గంటలు పని చేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో పోలీసు సిబ్బందికి పెట్రోలింగ్ వాహనాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ వంటి అప్‌గ్రేడ్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే తాజాగా ట్రాఫిక్‌ సిబ్బందికి ఈ ఏసీ హెల్మెట్‌లు అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..