Wrestlers Protest: పహీల్వాన్ల నిరసన శిబిరంలో రైతు సంఘాలు.. బారికేడ్లను ధ్వంసం చేసుకుని మరి..!
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తున్న రెజ్లర్లకు మద్దతుగా రైతు సంఘాలు రంగంలోకి దిగాయి. జంతర్‌మంతర్ దగ్గర పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని పహిల్వాన్ల దగ్గరకు చేరుకున్నారు..
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తున్న రెజ్లర్లకు మద్దతుగా రైతు సంఘాలు రంగంలోకి దిగాయి. జంతర్‌మంతర్ దగ్గర పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని పహిల్వాన్ల దగ్గరకు చేరుకున్నారు రైతులు. ఈ క్రమంలో ఆ బారికేడ్లు ద్వంసమవడంతో పంజాబ్, హర్యానాతో పాటు యూపీకి చెందిన రైతులు కూడా జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. అయితే బారికేడ్లను ధ్వంసం చేయడంలో తమ పాత్ర లేదంటున్నారు రెజ్లర్లు. కొంతమంది సంఘవిద్రోహక శక్తులు జంతర్‌మంతర్‌కు వచ్చి ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇంకా తాము బజరంగ్‌బలి భక్తులమని , హింసకు వ్యతిరేమంటున్నారు రెజ్లర్లు.
అంతకముందు ఆదివారం కూడా రెజ్లర్ల ధర్నాకు రైతు సంఘాల నేతలు మద్దతిచ్చారు. 15 రోజుల్లో బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయాలని రైతులు డెడ్‌లైన్ పెట్టారు. ఇక తమను లైంగికంగా వేధిస్తున్న బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయాలని గత 14 రోజులుగా జంతర్‌మంతర్‌లో రెజ్లర్ల చేస్తున్న ఆందోళన గురించి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..