TISS Recruitment 2023: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో టీచింగ్ కొలువులు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS).. 19 టీచింగ్ స్టాఫ్ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS).. 19 టీచింగ్ స్టాఫ్ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, సైకాలజీ, ఆర్థిక శాస్త్రం, భూగోళశాస్త్రం, సామాజిక శాస్త్రం, పొలిటికల్ సైన్సెస్, లాంగ్వేజెస్, మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్/స్లెట్/సెట్‌లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు మే 16, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ.2000లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు రూ.500లు చెల్లించవల్సి ఉంటుంది. పని అనుభవం, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ ఎంపిక ఉంటుంది. అర్హత సాధించినవారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.