TS 10th Class Results 2023: తెలంగాణ ‘పదో తరగతి’ ఫలితాలు వచ్చేశాయ్.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ తెలుసుకోండిలా..
Telangana SSC Results 2023: విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయ్. ముందుగా చెప్పినట్లుగానే ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాతి రోజే పదో తరగతి రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
పదో తరగతి ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..
TS SSC Results 2023: విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయ్. ముందుగా చెప్పినట్లుగానే ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాతి రోజే పదో తరగతి రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. ఈ క్రమంలో పదో తరగతి ఫలితాలను ఫలితాలను టీవీ9 వెబ్‌సైట్‌లో చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు..
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 4.4 లక్షల మంది విద్యార్ధులు హాజరు కాగా, వారిలో 86.60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక గతంలో లాగానే ఈ ఏడాది కూడా టెన్త్ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. పరీక్ష రాసిన బాలికలలో 88. 53 శాతం మంతి పాసవ్వగా, పదో తరగతి ఎగ్జామ్స్ రాసిన బాలురిలో 84.68 శాతం మంతి ఉత్తీర్ణులయ్యారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..