CSK vs DC: ఢిల్లీతో మ్యాచ్‌కు బెంచ్‌పైనే రూ. 16.25 కోట్ల ప్లేయర్.. చెన్నై ప్లేయింగ్ XI మార్పులు?
CSK vs DC, Ben Stokes: చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్ ఈరోజు అంటే మే 10న ఢిల్లీతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్‌ను CSK ప్లేయింగ్ XIలో చేర్చుకుంటారా లేదా అనేది దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
CSK vs DC, Ben Stokes: చెన్నై సూపర్ కింగ్స్ IPL 2023లో తమ తదుపరి అంటే 12వ మ్యాచ్‌ని ఈరోజు (మే 10) చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గురించి పెద్ద ప్రశ్న తలెత్తింది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్‌లో స్టోక్స్ ఇప్పటివరకు కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.
ఐపీఎల్ 2023 కోసం జరిగిన మినీ వేలంలో స్టోక్స్‌ను రూ. 16.25 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. స్టోక్స్ ఇంకా తన ధర ట్యాగ్‌కు ఏ రకంగానూ న్యాయం చేయలేకపోతున్నాడు. రెండు మ్యాచ్‌లలో, అతను కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక ఓవర్‌లో మాత్రమే 18 పరుగులు వెచ్చించాడు. మిగిలిన మ్యాచ్‌లలో, స్టోక్స్ గాయం కారణంగా బెంచ్‌పై కూర్చున్నాడు.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఉంటాడా?
బెన్ స్టోక్స్ ఫిట్‌నెస్ గురించి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ మాట్లాడుతూ, స్టోక్స్ ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడని, ఎంపికకు అందుబాటులో ఉన్నాడని ప్రకటించాడు. పిచ్‌ల స్వభావం, ప్లేయింగ్ XI కలయిక కారణంగా అతను గత కొన్ని మ్యాచ్‌లలో ప్లేయింగ్ XI నుంచి దూరంగా ఉన్నాడు అని తెలిపాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో స్టోక్స్ మరోసారి ఔట్ కావలసి వస్తుందని చెప్పొచ్చు. జట్టులో ఇప్పటికే డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, మహిష్ తీక్షణ, మతిషా పతిరనా రూపంలో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటి వరకు నలుగురు ఆటగాళ్లు జట్టుకు మంచి ప్రదర్శన చేశారు. ఈ విధంగా చూస్తే బెన్ స్టోక్స్‌కు జట్టులో చోటు దక్కేలా కనిపించడం లేదు.
చెన్నై ప్రాబబుల్ ప్లేయింగ్ XI..
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్ & వికెట్ కీపర్), దీపక్ చాహర్, మతిషా పతిరనా.