IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వన్డే వరల్డ్ కప్‌లో భారత్-పాక్ పోరుకు డేట్ ఫిక్స్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే?
IND vs PAK, ODI World Cup 2023: అక్టోబర్-నవంబర్‌లో భారతదేశంలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ గురించి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ టోర్నీలోని ఇండో-పాక్ కీలక పోరుకు కూడా తేదీ ఫిక్స్ అయింది. ప్రస్తుత నివేదిక ప్రకారం..
ODI World Cup 2023: అక్టోబర్-నవంబర్‌లో భారతదేశంలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ గురించి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆసియా కప్ 2023కి సంబంధించి బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య ఓ పెద్ద వార్త బయటకు వస్తోంది. వన్డే ప్రపంచ కప్ 2023 కోసం భారతదేశంలో పర్యటించడానికి PCB అంగీకరించిందంట. టోర్నీని బహిష్కరిస్తానని గతంలో బెదిరించిన పీసీబీ.. బీసీసీఐ ముందు తలొగ్గినట్లు తెలుస్తోంది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, వన్డే ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అక్టోబర్ 5న, అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
దీంతో పాటు టోర్నీలోని ఇండో-పాక్ కీలక పోరుకు కూడా తేదీ ఫిక్స్ అయింది. ప్రస్తుత నివేదిక ప్రకారం.. అక్టోబర్ 15న దాయాదుల పోరు జరగనుంది. భారత్, పాకిస్థాన్‌లు తలపడనున్న ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది.
టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్‌ని ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించారు. మరో సెమీ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లేదా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే అవకాశం ఉందంట.
పాకిస్థాన్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులలో జరిగేలా నిర్ణయించినట్లు సమాచారం.
ప్రస్తుత సమాచారం ప్రకారం అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగాల్సి ఉండగా షెడ్యూల్ ఖరారు కాలేదు. అందువల్ల ప్రారంభ లేదా ముగింపు తేదీలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..