AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 మ్యాచ్‌ల్లో 184 పరుగులు.. ఐపీఎల్‌లో రోహిత్ అట్టర్ ఫ్లాప్.. టీమిండియాకు మంచిదే అంటోన్న గణాంకాలు.. ఎందుకో తెలుసా?

Rohit Sharma, MI VS RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో రోహిత్ శర్మ ప్రదర్శన చాలా పేలవంగా తయారైంది. అయితే, అతని వైఫల్యం టీమ్ ఇండియాకు మంచిదని గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకో తెలుసా?

10 మ్యాచ్‌ల్లో 184 పరుగులు.. ఐపీఎల్‌లో రోహిత్ అట్టర్ ఫ్లాప్.. టీమిండియాకు మంచిదే అంటోన్న గణాంకాలు.. ఎందుకో తెలుసా?
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా రోహిత్ శర్మ వరుసగా 5 ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌లో ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. అంతకుముందు 2017 సీజన్‌లో రోహిత్ వరుసగా 4 ఇన్నింగ్స్‌లలో ఇలా సింగిల్ డిజిట్‌లో పెవిలియన్ చేరాడు.
Venkata Chari
|

Updated on: May 10, 2023 | 6:30 AM

Share

Rohit Sharma: IPL 2023లో రోహిత్ శర్మ బ్యాట్ పరుగుల వర్షం కురిపించడంలో తంటాలు పడుతోంది. రెండుసార్లు డకౌట్ కూడా అయ్యాడు. ఇక రోహిత్ బ్యాటింగ్ సగటు 20 కంటే తక్కువగానే ఉంది. స్ట్రైక్ రేట్ కూడా 130 కంటే తక్కువగా ఉంది. రోహిత్ శర్మ అభిమానులకు ఈ గణాంకాలు అస్సలు నచ్చవని స్పష్టమవుతోంది. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ వైఫల్యం చాలా మంచిదని మీకు తెలుసా? ఇదేంటి ఇలా అంటున్నారని షాక్ అవుతున్నారా.. ఆగండాగండి.. అక్కడికే వస్తున్నాం.. అసలు విషయం తెలిస్తే.. మీరు కూడా ఇందుకు ఒప్పుకుంటారు. ఎందుకంటే రోహిత్ శర్మ ఐపీఎల్‌లో విఫలమైతే, ఆ తర్వాత అతని బ్యాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో, ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో పరుగుల వర్షం కురిపిస్తుంది. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయండోయ్.

IPL 2023 తర్వాత, టీం ఇండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడాల్సి ఉంది. జూన్ 7న లండన్‌లోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో టైటిల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో హిట్‌మ్యాన్ బ్యాట్ సైలెంట్‌గా ఉన్నా, ఆ టైటిల్ మ్యాచ్‌లో రోహిత్ తప్పక పరుగులు సాధించాలని రోహిత్ అభిమానులు ఇష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌లో విఫలమైన రోహిత్ శర్మ.. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్‌లో ఎలా అద్భుతాలు చేస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌లో విఫలం.. ఐసీసీ ఈవెంట్స్‌లో పరుగుల వర్షం..

ఐపీఎల్ గత ఐదు సీజన్ల గణాంకాలను పరిశీలిస్తే, ఈ టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కనబరిచాడు. కానీ, ఆ తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్‌లో బలమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ 2017లో రోహిత్ శర్మ 23.78 సగటుతో 333 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, ఐపీఎల్ తర్వాత జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ సత్తా చాటాడు. రోహిత్ 5 మ్యాచ్‌ల్లో 76 సగటుతో 304 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్‌ నుంచి ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన..

ఐపీఎల్ 2019 సీజన్ కూడా రోహిత్ శర్మకు మంచిది కాదు. ఈ ఆటగాడు 15 మ్యాచ్‌ల్లో 28.92 సగటుతో పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ కూడా 130 కంటే తక్కువగా ఉంది. ఐపీఎల్ తర్వాత జరిగిన ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 5 సెంచరీల సాయంతో 648 పరుగులు చేశాడు. రోహిత్ సగటు కూడా 81గానే నిలిచింది.

2021 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ఫైర్..

2021లో కూడా రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఈసారి కూడా అతని సగటు 30 కంటే తక్కువ. స్ట్రైక్ రేట్ 130 కంటే తక్కువగానే ఉంది. కానీ, టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ దుమ్ము రేపాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ బ్యాట్ 34.79 సగటుతో 174 పరుగులు చేశాడు. రోహిత్ స్ట్రైక్ రేట్ కూడా 150 కంటే ఎక్కువగా ఉంది.

2022 టీ20 ప్రపంచకప్‌లో మాత్రం రోహిత్ శర్మ బ్యాట్ పనిచేయలేదు. అయితే, ఆ సీజన్‌లో ఐపీఎల్‌లో కూడా ఆడలేదు. ఐపీఎల్‌లో విఫలమైన రోహిత్ ఐసీసీ టోర్నీల్లో అద్భుతాలు చేయడం 4 ఏళ్లలో 3 సంవత్సరాలలో జరిగింది. ఈసారి కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాం. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ కూడా రోహిత్ శర్మకు ప్రతికూలంగా మారింది. ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అతను ఏమి చేస్తాడో చూడాలి?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..