- Telugu News Photo Gallery Eating Dark Chocolates will be very helpful and provides you these health benefits, check to know full details
Health Tips: డార్క్ చాక్లెట్స్ తింటున్నారా..? అయితే జర ఈ విషయాలను కూడా తెలుసుకోండి మరి..
Dark Chocolate: చాలా మంది చాక్లెట్స్‌ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే వాస్తవానికి మార్కెట్‌లోని అన్ని రకాల చాక్లెట్ల కంటే డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి ప్రయోజకరమని అటు వైద్య నిపుణులు, ఇటు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో డార్క్ చాక్లెట్‌తో ఆరోగ్యానికి గల ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 10, 2023 | 1:15 PM

కొలెస్ట్రాల్: డార్క్ చాక్లెట్ కారణంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవడమే కాక మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి కొలెస్ట్రాల్ హృదయ సంబంధ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయంగా ఉంటుంది. అలా కాకుండా చెడు కొలెస్ట్రాల్ఎక్కువగా ఉంటే ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి డార్క్ చాక్లెట్ తినడం ద్వారా గుండెను రక్షించుకోవచ్చు.

రక్తపోటు కంట్రోల్: డార్క్ చాక్లెట్‌లోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో మెరుగ్గా ఉపయోగపడుతుంది. అంతేకాక డార్క్ చాక్లెట్‌ను తింటే శరీరంలోని నైట్రిక్ ఆక్సైడ్ లెవల్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలలో చిన్న గ్రాహకాలపై పనిచేసి వాటిని విడదీయడానికి సహాయపడుతుంది, ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది.

మెదడు పనితీరు: జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడును ఉత్తేజం చేయడానికి కూడా డార్క్ చాక్లెట్ సహాయపడుతుంది. నాటింగ్హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 2012లో డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగైన రీతిలో పెరుగుతుందని కనుగొన్నారు. ఫలితంగా మెదడు మెరుగ్గా పనిచేస్తుంది. ఇంకా 2013లో న్యూరాలజీ జర్నల్ ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ తినడం ద్వారాజ్ఞాపకశక్తి దాదాపు 30% పెరుగుతుందని, సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా మెరుగవుతాయని ప్రచురించింది.

గుండె ఆరోగ్యం: డార్క్ చాక్లెట్ హృదయ సంబంధింత వ్యాధుల నుంచి రక్షిస్తుందని, ఇంకా గుండె పనితీరును మెరుగుపరుస్తుందని 2015లో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అమెరికన్ కెమికల్ సొసైటీ 2014లో సమర్పించిన మరొక అధ్యయనం.. డార్క్ చాక్లెట్ తినేటప్పుడు, కడుపులోని గట్ బ్యాక్టీరియాను బయటికి పంపిస్తుందని, ఫలితంగా హృదయ సంబంధ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని తెలిపింది.

బరువు నియంత్రణ: కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం డార్క్ చాక్లెట్ తినే 1000 మందిపై అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో అప్పుడప్పుడు చాక్లెట్ తిన్న వారి కంటే ఎక్కువగా తిన్నవారే సన్నగా, బరువు తక్కువగా ఉన్నారని తేలింది. డార్క్ చాక్లెట్ కేలరీలతో నిండి ఉన్నప్పటికీ, బరువు తగ్గడానికి అనుకూలంగా ఉండే పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని యూనివర్సటీ పేర్కొంది.





























