AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అమ్మ బాబోయ్.. మొసలిని అమాంతం మింగేసిన కొండచిలువ.. పొట్ట కోసి చూడగా షాక్..

మనిషి జీవితం వేరు.. జంగిల్ జీవితం వేరు. ఇక్కడ ప్రతి క్షణం యుద్ధమే. అడవిలో బలమైన జీవులతో రాజ్యం. బలహీనమైన జీవులు.. బతుకు జీవుడా అంటూ ప్రతినిత్యం ప్రాణం కోసం పోరాడాల్సి ఉంటుంది. అయితే, పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోశమ్మ కొట్టిందన్నట్లు..

Watch: అమ్మ బాబోయ్.. మొసలిని అమాంతం మింగేసిన కొండచిలువ.. పొట్ట కోసి చూడగా షాక్..
Wildlife
Shiva Prajapati
|

Updated on: May 09, 2023 | 8:35 PM

Share

మనిషి జీవితం వేరు.. జంగిల్ జీవితం వేరు. ఇక్కడ ప్రతి క్షణం యుద్ధమే. అడవిలో బలమైన జీవులతో రాజ్యం. బలహీనమైన జీవులు.. బతుకు జీవుడా అంటూ ప్రతినిత్యం ప్రాణం కోసం పోరాడాల్సి ఉంటుంది. అయితే, పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోశమ్మ కొట్టిందన్నట్లు.. బలమైన జంతువులకు కూడా ప్రాణం భయం చూపే జంతువులు అడవిలో చాలానే ఉంటాయి. కొన్నిసార్లు ఒక క్రూరమైన వేటగాడు బాధితుడు అవుతాడు. ఆ క్రూరమైన వేటగాడు తన ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఇందుకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అత్యంత క్రూరమైన జంతువుల్లో మొసలి కూడా ఒకటి. దీనికి ఏ ప్రాణి అయినా చిక్కిందంటే ప్రాణాలు ఫసకే. దాని బలమైన కోర పళ్లతో చీల్చి పడేస్తుంది. అయితే, ఇంతటి భీకరమైన మొసలిని ఓ కొండ చిలువ అమాంతం మింగేసింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొండ చిలువ ఆ మొసలిని మింగిన తరువాత డైజేషన్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంది. అది గమనించిన అటవీ అధికారులు ఆ పామును చాకచక్యంగా పట్టున్నారు. పొట్టలో ఏదో ఉందని గ్రహించి, ఆపరేషన్ చేయగా.. 5 అడుగుల మొసలి కనిపించింది. దానిని బయటకు తీశారు వైద్యులు. అది చూసి వైద్యులు సైతం షాక్ అయ్యారు. ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. @TerrifyingNatur పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ‘18 అడుగుల కొండ చిలువ కడుపులో 5 అడుగుల మొసలి’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు హడలిపోతున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!