ఈమె వేసుకున్న జీన్స్‌ ప్యాంట్‌ ఉతికి 18 ఏళ్లు అయిందట.

ఈమె వేసుకున్న జీన్స్‌ ప్యాంట్‌ ఉతికి 18 ఏళ్లు అయిందట.

Phani CH

|

Updated on: May 09, 2023 | 8:49 PM

సాధారణంగా ఏ బట్టలైనా ఒకసారి వేసుకున్నాక ఉతక్కుండా మళ్లీ వేసుకోవాలంటే కష్టమే. మహా అంటే రెండుసార్లు ధరిస్తారు. తర్వాత ఖచ్చితంగా ఉతకాల్సిందే. కానీ ఇక్కడ ఓ మహిళ అసలు బట్టలు ఉతకడం ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతోంది. 18 ఏళ్లుగా తను వేసుకుంటున్న ప్యాంట్లను ఉతకలేదట.

సాధారణంగా ఏ బట్టలైనా ఒకసారి వేసుకున్నాక ఉతక్కుండా మళ్లీ వేసుకోవాలంటే కష్టమే. మహా అంటే రెండుసార్లు ధరిస్తారు. తర్వాత ఖచ్చితంగా ఉతకాల్సిందే. కానీ ఇక్కడ ఓ మహిళ అసలు బట్టలు ఉతకడం ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతోంది. 18 ఏళ్లుగా తను వేసుకుంటున్న ప్యాంట్లను ఉతకలేదట. పైగా అవి ఇంకా కొత్తగా, ఫ్రెష్‌గా ఉన్నాయని చెబుతోంది. వినడానికే రోతగా ఉంది కదూ.. కానీ ఇది నిజం. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. ఇంగ్లాండ్‌ యార్క్‌షైర్‌కు చెందిన సాండ్రా విల్లిస్ అనే మహిళ 18 ఏళ్ల క్రితం ఓ రెండు ఎంఎస్ డెనిమ్ జీన్స్ ప్యాంట్లను కొందట. వాటిని ఏడాదికి ఒక్కసారి మాత్రమే ధరిస్తోందట. వాటిపైన ఎలాంటి మరకలు పడకపోవడంతో వాటిని ఉతకాలనిపించలేదట. ఈమె సెంటు కూడా బాగానే వాడుతుండటంతో అవి చెమట వాసన కూడా రావడం లేదంటోంది. అలాంటప్పుడు ఇంకెందుకు ఉతకడం అని వాటిని 18 ఏళ్లుగా అలానే ఉంచుతోందట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas Adipurush Trailer: అదిరిపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. విజువల్‌ ఎఫక్ట్స్ నెక్స్ట్ లెవల్

Published on: May 09, 2023 08:31 PM