Viral Video: ఆటో డ్రైవర్‌కు ఊహించని షాకిచ్చిన మహిళ.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ తో ఆటోడ్రైవర్‌ ఎమోషనల్‌..

Viral Video: ఆటో డ్రైవర్‌కు ఊహించని షాకిచ్చిన మహిళ.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ తో ఆటోడ్రైవర్‌ ఎమోషనల్‌..

Anil kumar poka

|

Updated on: May 08, 2023 | 9:48 PM

ఓ మహిళ ఆటో డ్రైవర్‌కు వినూత్నంగా తన కృతజ్ఞతలు తెలిపింది. తనను గమ్యస్థానానికిచేర్చిన ఆటోడ్రైవర్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. అది చూసి ఆటోవాలా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఓ మహిళ ఆటో ఎక్కింది. తను దిగాల్సిన చోటు చెప్పింది. ఆటో రోడ్డుపైన దూసుకుపోతోంది. ఆ మహిళ ఆటోలో కూర్చుని సీరియస్‌గా ఏదో రాసుకుంటోంది. ఇంతలో తను దిగాల్సిన ఏరియా వచ్చింది. ఆటో డ్రైవర్‌ ఆటో ఆపగానే అతనికి డబ్బుతోపాటు ఓ స్కెచ్‌ను అతని చేతిలో పెట్టింది. ఆమె అంతవరకూ సీరియస్‌గా ఆటోలో కూర్చిని వెనుకనుంచి ఆటోడ్రైవర్‌ బొమ్మగీసింది. మూడు నిమిషాల్లో త‌న రైడ్ ముగియ‌గా స్కెచ్‌ను ఆటో డ్రైవ‌ర్‌కు ఆమె అంద‌చేసింది. త‌న స్కెచ్‌ను చూసుకున్న ఆటో డ్రైవ‌ర్ ఆనందంతో ఉద్వేగానికి లోన‌య్యాడు. ఈ వీడియోను ఆ యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేస్తూ, ఏ ఆటోలు ఆప‌ని స‌మ‌యంలో దిక్కుతోచక నిలుచున్న తనను అత‌డు పిక్ చేసుకున్నాడ‌ని, అందుకు అత‌డికి ధ‌న్యవాదాలు చెబుతూ స్కెచ్ గీశాన‌ని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది ఆ యువతి. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ వీడియో నెటిజ‌న్లను విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే ప‌ది ల‌క్షలమందికి పైగా వీక్షించారు. దీక్ష ఆటోడ్రైవ‌ర్‌కు ధ‌న్యవాదాలు తెలిపిన తీరుకు నెటిజ‌న్లు ముగ్ధుల‌య్యారు. సామాన్యుడి ముఖంలో న‌వ్వులు పూయించార‌ని మ‌రో యూజ‌ర్ ప్రశంస‌లు గుప్పించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!