AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: 1951లో 6 నెలల వాటర్ బిల్లు ఎంతో తెలుసా? ఇప్పుడైతే వాటర్ బాటిల్ కూడా రాదు..!

1951 Old Water Bill: ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటాం.. పురాతన వస్తువులు లభ్యమైనా, కొన్నేళ్ల క్రిందటి డాక్యూమెంట్స్, బిల్ పేపర్స్ వంటి లభ్యమైతే.. అపురూపంగా చూస్తాం. తాజాగా అలాంటి అపురూపమైన, ప్రత్యేకమైన బిల్ పేపర్ ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

Viral: 1951లో 6 నెలల వాటర్ బిల్లు ఎంతో తెలుసా? ఇప్పుడైతే వాటర్ బాటిల్ కూడా రాదు..!
Water Bill
Shiva Prajapati
|

Updated on: May 09, 2023 | 7:15 PM

Share

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటాం.. పురాతన వస్తువులు లభ్యమైనా, కొన్నేళ్ల క్రిందటి డాక్యూమెంట్స్, బిల్ పేపర్స్ వంటి లభ్యమైతే.. అపురూపంగా చూస్తాం. తాజాగా అలాంటి అపురూపమైన, ప్రత్యేకమైన బిల్ పేపర్ ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అయితే, ఇది మనదేశానికి సంబంధించినది కాదండోయ్.. బ్రిటన్‌కు సంబంధించిన వాటర్ బిల్లు ప్రస్తుతం నెట్టింట్లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. ఆ బిల్లు స్లిప్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుత రోజుల్లో కరెంటు, నీటి బిల్లులు మోతమోగుతాయి. ఆ బిల్లులను చూస్తే గుండె గుభేల్ అంటుంది. అధిక బిల్లుల కారణంగా కరెంట్, వాటర్ వినియోగించడానికి బెదిరిపోతారు. ఇక, ఈ బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారుల కంట నీళ్లు వస్తుంటుంది. అయితే, తాజాగా 70 ఏళ్ల క్రితం నాటి వాటర్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నీటి బిల్లులో మొత్తం ఆరు నెలల బిల్లును కలిపి వేశారు. నేటితో పోలిస్తే ఈ ధర చాలా చాలా తక్కువ. నాటి ధరతో పోలిస్తే.. నేడు వాటర్ బాటిల్ కూడా రాదంటే అతిశయోక్తి కాదు. వైరల్ అవుతున్న వాటర్ బిల్లు స్లిప్ ఆకు పచ్చరంగులో ఉంది. దానిపై ఉన్న వివరాల ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన ఈ బిల్లు ప్రతి అక్టోబర్ 1, 1951 నుంచి మార్చి 31, 1952 వరకు ఉంది. దీనిపై మొత్తం ధర 16 పౌండ్లుగా ఉంది. అప్పట్లో రూపాయి విలు 13.33 గా ఉంది. అంటే ఇది ఇండియన్ కరెన్సీలో రూ.214.60 చెల్లించాల్సి ఉండేది. నేటి విలువ ప్రకారం అయితే.. దాని ధర రూ. 1,664 అవుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ బిల్లు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే, ఈ బిల్లును చూసి కొందరు నెటిజన్లు తమకు సంబంధించిన పాత బిల్లులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నాటి పరిస్థితులకు, నేటి పరిస్థితులకు పోలుస్తూ ఆశ్చర్యపోతున్నారు నెటిజనులు. కొన్ని రోజుల క్రితం, ఒక రిటైర్డ్ ఐఏస్ అధికారి తన 5వ తరగతికి చెందిన 80 ఏళ్ల నాటి ప్రశ్నపత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ప్రశ్నలు చాలా కష్టంగా ఉండటం చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు.

Energy Bill

Water Bill

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..