- Telugu News Photo Gallery Women Health Every woman must follow these diet tips to stay healthy in life
Women Health: మహిళల కోసం ప్రత్యేకం.. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇవి తినండి..
ఏదైనా సంబంధాన్ని బలోపేతం చేయడానికి లేదా సంబంధంలో కొనసాగుతున్న దూరాన్ని తొలగించడానికి చాణక్యుడు కొన్ని విషయాలను ప్రస్తావించాడు. ఎవరైతే వాటిని దృష్టిలో ఉంచుకుంటారో.. వారి ప్రేమ బంధంలో ఎప్పుడూ దూరం పెరగదు. పైగా ఆ బంధం మరింత దగ్గరవుతుంది.
Updated on: May 10, 2023 | 9:53 PM

కుటుంబ సంరక్షణ, ఆఫీస్ పనిలో బిజీ కారణంగా చాలా మంది మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. ఆహారం, డ్రింక్స్ పై తక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఫలితంగా అది మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ఏం తినాలి? ఏం చేయాలి? అనేది తెలుసుకుందాం..

ప్రొటీన్ రిచ్ ఫుడ్స్: ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. చక్కెర ఆధారిత ఆహారాన్ని తినడం మానుకోవాలి. పనీర్, పప్పులు, సోయాతో చేసిన ఉత్పత్తులైన టోఫు, సోయా పాలు తీసుకోవచ్చు. ఇది కాకుండా, నాన్ వెజ్ అయితే గుడ్లు, చికెన్ తినవచ్చు.

కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు: కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కాల్షియం కలిగిన ఆహారాలు మహిళల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. దీని వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇందులో పాలు, గింజలు, డ్రై ఫ్రూట్స్, బెర్రీలు ఉన్నాయి.

నిమ్మకాయ: రోజూ నిమ్మకాయ తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ జ్యూస్ తాగొచ్చు.

మొలకలు: రోజూ మొలకలు తినవచ్చు. మొలకలు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.

నానబెట్టిన బాదం: రోజూ నానబెట్టిన బాదంపప్పు తినాలి. దీనిని స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కళ్ల ఆరోగ్యానికి బాదం చాలా మేలు చేస్తుంది.

జీవక్రియ: జీవక్రియను నిర్వహించడానికి కొంచెం కొంచెం తినాలి. ఆరోగ్యకరమైన స్నాక్స్ ఒకటి, రెండు సార్లు తీసుకోవాలి. బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో మొత్తం ఆహారం తినకుండా ఉండొద్దు.

ఒత్తిడి నుంచి బయటపడాలి: ఒత్తిడిని నియంత్రించడానికి ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయాలి. ఇది కాకుండా డ్యాన్స్ కూడా చేయొచ్చు. వాకింగ్, ఇతర వ్యాయామాలు కూడా చేయొచ్చు. ఇవి మీ ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతాయి. సంతోషంగా జీవిస్తారు.




