AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharat Saxena: 72 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల కుర్రాడిలా శరత్ సక్సేనా.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?

శరత్ సక్సెనా.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు, విలన్ ప్రేమికుడు ఉండరు. 70వ దశకంలోనే సినీరంగ ప్రవేశం చేసిన శరత్ సక్సేనా.. హిందీ, తెలుగు, తమిళం సహా అనేక భాషల్లో విలన్‌గా, తండ్రిగా, సహ నటుడిగా, అనేక క్యారెక్టర్లలో నటించి ప్రేక్షకులను అలరించారు. వారి అభిమానాన్ని చురగొన్నారు.

Sharat Saxena: 72 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల కుర్రాడిలా శరత్ సక్సేనా.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
Sharat Saxena
Shiva Prajapati
|

Updated on: May 10, 2023 | 3:09 PM

Share

శరత్ సక్సెనా.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు, విలన్ ప్రేమికుడు ఉండరు. 70వ దశకంలోనే సినీరంగ ప్రవేశం చేసిన శరత్ సక్సేనా.. హిందీ, తెలుగు, తమిళం సహా అనేక భాషల్లో విలన్‌గా, తండ్రిగా, సహ నటుడిగా, అనేక క్యారెక్టర్లలో నటించి ప్రేక్షకులను అలరించారు. వారి అభిమానాన్ని చురగొన్నారు. 70వ దశకంలోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సక్సేనా.. తొలినాళ్లలో ఏ జోష్‌తో అయితే యాక్టింగ్ చేశారో.. ఇప్పటికీ అదే జోష్ కంటిన్యూ చేస్తున్నారు. తెలుగులో మెగస్టార్ చిరంజీవి హిట్ మూవీస్ అయినా ‘ముగ్గురు మొనగాళ్లు’, ముఠా మేస్త్రీ తో పాటు, సింహాద్రి, బన్నీ వంటి సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల మదిని గెలిచారు.

అయితే, శరత్ సక్సేనా 72 ఏళ్ల వయసునూ తగ్గేదేలే అంటూ.. తన ఫిట్‌నెస్, శరీర సౌష్టవం, ఎనర్జీతో యువ యాక్టర్స్‌కి సవాల్ విసురుతున్నారు. తాజాగా శరత్ సక్సేనాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వయస్సుతో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ, శరత్ సక్సేనా మాత్రం వయస్సును ఓడించి.. తన ఫిట్‌నెస్‌ అంతకంతకూ పెంచుకుంటున్నారు. 23 ఏళ్ల క్రితం సూపర్ హిట్ మూవీ ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో ఎలా కనిపించారు.. ఇప్పుడు 72 ఏళ్ల వయసులోనూ అలాగే కనిపించి ఆశ్చర్యపరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

శరత్ రీసెంట్‌గా బ్లాక్ టీ షర్ట్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలో కండలు తిరిగిన బాడీతో ఔరా అనిపించేలా ఉన్నారు. మాంచి కండరపుష్టితో.. యువకుడిలా కనిపిస్తున్నారు. 72 ఏళ్ల వయసులోనూ యువ నటులను తలదన్నేలా శరీర సౌష్టవాన్ని కలిగి ఉన్నారు. అయితే, తన ఫోటోలను షేర్ చేసిన శరత్ సక్సేనా.. ‘నేను మేకులా ఉండటం కన్నా సమ్మెటలా ఉండేందుకే ఇష్టపడుతా’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ శరీర సౌష్టవం చూసి సినీ ప్రేక్షకులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

శరత్ సక్సేనా షేర్ చేసిన ఫోటోలు ఇవే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..