Karnataka Election Results: దేశం చూపు కర్నాటక వైపు.. బీజేపీకి ఇజ్జత్ కా సవాల్.. కాంగ్రెస్‌కు గోల్డెన్ ఛాన్స్..!

ఇవాళే జడ్జిమెంట్ డే. దేశమంతా కర్నాటక వైపే చూస్తోంది. కేంద్రంలో అధికార పార్టీ.. అపోజిషన్ పార్టీ.. రెండింటికీ ప్రతిష్టాత్మకంగా మారింది కన్నడ పోరు. కాంగ్రెస్‌కి డూ ఆర్ డై.. బీజేపీకి ఇజ్జత్‌ కా సవాల్. ఇవాళొచ్చే అంతిమతీర్పు జాతీయ రాజకీయాల్లో పెద్ద కుదుపు కాబోతోందన్నదైతే క్లియర్. టోటల్‌గా 2024 లోక్‌సభ ఎన్నికలకు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలే సెమీఫైనల్‌.

Karnataka Election Results: దేశం చూపు కర్నాటక వైపు.. బీజేపీకి ఇజ్జత్ కా సవాల్.. కాంగ్రెస్‌కు గోల్డెన్ ఛాన్స్..!
2024 Elections
Follow us
Shiva Prajapati

|

Updated on: May 12, 2023 | 9:53 PM

ఇవాళే జడ్జిమెంట్ డే. దేశమంతా కర్నాటక వైపే చూస్తోంది. కేంద్రంలో అధికార పార్టీ.. అపోజిషన్ పార్టీ.. రెండింటికీ ప్రతిష్టాత్మకంగా మారింది కన్నడ పోరు. కాంగ్రెస్‌కి డూ ఆర్ డై.. బీజేపీకి ఇజ్జత్‌ కా సవాల్. ఇవాళొచ్చే అంతిమతీర్పు జాతీయ రాజకీయాల్లో పెద్ద కుదుపు కాబోతోందన్నదైతే క్లియర్. టోటల్‌గా 2024 లోక్‌సభ ఎన్నికలకు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలే సెమీఫైనల్‌. మరి.. అందుకే కన్నడ ఫలితం కోసం దేశమంతటా నరాలు తెగే ఉత్కంఠ.

కాంగ్రెస్, బీజేపీ అండ్ జేడీఎస్.. ఈసారి కూడా కుమ్మేసుకుందాం రా అంటూ ఆ మూడు పార్టీలే కన్నడ నాట యుద్ధానికి దిగేశాయి. కాకపోతే.. గతానికి ఇప్పటికీ వీళ్ల జాతకాల్లో చెప్పుకోదగ్గ మార్పులొచ్చేశాయ్. మారిన పరిస్థితుల కారణంగా కర్నాటకలో మోదీ హవా కంటిన్యూ అవుతుందా.. లేక కట్టయిపోతుందా? కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీస్తుందా.. కొత్త ఊపిరినిస్తుందా? అనే సస్పెన్స్ దేశం మొత్తాన్నీ కుదిపేస్తోంది.

ఒక్కమాటలో చెప్పాలంటే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ఇజ్జత్‌ కా సవాల్. కాంగ్రెస్ పార్టీకి సువర్ణావకాశం. కేంద్రంలో రెండుసార్లు విక్టరీ కొట్టిన బీజేపీ.. హ్యాట్రిక్‌ మీద ఆశలు పెట్టుకుంది. కానీ.. పెట్రోల్, వంటగ్యాస్ ధరలు పెరగడం లాంటి అంశాలు మోదీ చరిష్మాను తగ్గించాయన్న అనుమానాలు పెంచేశాయి. ప్రతికూల వాతావరణంలో కూడా గుజరాత్‌ అసెంబ్లీని దక్కించుకుంది బీజేపీ. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో మంచి ఫలితాల్నే రాబట్టుకుంది. యూపీలో యోగీని గెలిపించుకున్నా.. గుజరాత్‌లో 27 ఏళ్ల తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేకతను తిప్పికొట్టినా.. పంజాబ్‌, హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం కమలనాథుల గోల్డెన్ డ్రీమ్స్‌ అడ్డం తిరిగాయి. అందుకే.. మోదీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగిందా అనే సందేహం మళ్లీ డిఫెన్స్‌లో పడేసింది బీజేపీని. ఆ డౌట్స్ అన్నీ పటాపంచలు కావాలంటే ఇవాళ్టి కన్నడ ఫలితమే కీలకం.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం చత్తీస్‌ఘడ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందుకే.. కన్నడ ఫలితం మీద భారీ ఆశలే పెట్టుకుంది. సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకుంటే ఏఐసీసీ ప్రెసిడెంట్‌గా మల్లికార్జున ఖార్గె సెంటిమెంట్ వర్కవుటైనట్టు భావిస్తోంది. భారత్‌జోడో యాత్ర తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కనుక.. రాహుల్ ఫ్యాక్టర్ పనిచేసిందా లేదా అనే క్లారిటీ కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీని ఓడించి పవర్లోకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కర్నాటకలో అదే ఊపు కొనసాగితే తర్వాతి ఎన్నికలకు ఇది బూస్టింగ్ అవుతుంది.

సౌత్‌లో తమకున్న ఏకైక రాష్ట్రం కర్నాటక కనుక.. దాన్ని పోగొట్టుకోకూడదన్నది బీజేపీ కమిట్‌మెంట్. ఒకవేళ ఫలితం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే దక్షిణాదిన వేళ్లూనుకోవాలన్న బీజేపీ ఆశలకు గండి పడ్డట్టే లెక్క. ఎగ్జిట్ పోల్స్‌కి విరుద్ధంగా కన్నడ ఓటరు బీజేపీనే కరుణిస్తే.. మోదీ పటాలం నూతనోత్సాహంతో ముందుకెళ్లే ఛాన్సుంది. డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తామన్న స్లోగన్‌ని రిపీట్ చెయ్యొచ్చన్న ధీమా కమలనాథులకు కలగొచ్చు.

నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అది సెమీఫైనల్ ఐతే… కర్నాటక ప్రీ-సెమీఫైనల్. దీన్ని గెలుచుకుంటే సెమీఫైనల్‌ని ధైర్యంగా ఫేస్ చెయ్యొచ్చనేది కాంగ్రెస్, బీజేపీల భావన. తృతీయ ప్రత్యామ్నాయం కోసం జట్టు కడుతున్న మమతా బెనర్జీ, కేసీఆర్, నితీష్‌కుమార్‌ లాంటి నేతలు కర్నాటక ఫలితం కోసం ఆసక్తిగా చూస్తున్నారు. అందుకే కన్నడ ఓటరు అంత కీలకమయ్యాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..