Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు.. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే..?
Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అల్ ఖదీర్ ట్రస్టు భూముల అవినీతి కేసులో తుది తీర్పు వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఇస్లామాబాద్ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ రెండు వారాలకు మాత్రమేనని..
Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అల్ ఖదీర్ ట్రస్టు భూముల అవినీతి కేసులో తుది తీర్పు వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కి ఇస్లామాబాద్ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ రెండు వారాలకు మాత్రమేనని హైకోర్టు ట్విస్టు ఇస్తూ తన తీర్పును వెల్లడించింది. బెయిల్ మంజూరు కాక ముందు కోర్టు ఎదుట ఇమ్రాన్ ఖాన్ తనను ఓ టెర్రరిస్టులా ట్రీట్ చేశారని, ఏది ఏమైనా దేశం విడిచి వెళ్లనని, బెయిల్ ఇవ్వకపోతే జైల్లో ఉండటానికైనా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
ఇక అంతకముందు పోలీసు గెస్ట్‌హౌస్ భారీ భద్రత మధ్య ఇస్లామాబాద్ హైకోర్టుకి ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పిలుపు మేరకు కోర్టు వద్దకు భారీగా తరలివచ్చారు ఆయన సపోర్టర్స్. అయితే కోర్టు బయట ఉన్నవారిపై లాఠీచార్జ్, అరెస్ట్‌లు చేయడంతో ఇస్లామాబాద్ అల్లకల్లోలంగా మారింది.
Islamabad High Court grants bail to Imran Khan in Al-Qadir Trust case for 2 weeks: Pakistan’s Geo News reports pic.twitter.com/TDRmNeegMG
— ANI (@ANI) May 12, 2023
కాగా, గురువారమే ఇమ్రాన్ అరెస్ట్ చట్టవిరుద్దమని, వెంటనే ఆయన్ని విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన్ను ఇంటికి వెళ్లేందుకు నిరాకరిస్తూ పోలీసు గెస్ట్‌హౌస్‌లో ఉండవచ్చని, అలాగే శుక్రవారం(ఈ రోజు) ఇస్లామాబాద్ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..