AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hypothyroid: థైరాయిడ్ లక్షణాలివే.. సమస్య నుంచి ఉపశమనం కోసం ఈ ఆహారాలను తినండి..

Hypothyroid: ప్రస్తుత కాలంలో డయాబెటీస్ మాదిరిగానే మానవాళిని వెంటాడుతున్న సమస్యలలో థైరాయిడ్ కూడా ఒకటి. అయితే థైరాయిడ్‌లో హైపోథైరాయిడ్, హైపర్‌ థైరాయిడిజం అని 2 రకాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది వచ్చినా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడాల్సి..

Hypothyroid: థైరాయిడ్ లక్షణాలివే.. సమస్య నుంచి ఉపశమనం కోసం ఈ ఆహారాలను తినండి..
Hypothyroid
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 11, 2023 | 8:06 PM

Share

Hypothyroid: ప్రస్తుత కాలంలో డయాబెటీస్ మాదిరిగానే మానవాళిని వెంటాడుతున్న సమస్యలలో థైరాయిడ్ కూడా ఒకటి. అయితే థైరాయిడ్‌లో హైపోథైరాయిడ్, హైపర్‌ థైరాయిడిజం అని 2 రకాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది వచ్చినా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో థైరాయిడ్‌తో బాధపడేవారు కొన్ని రకాల ఆహారపు అలవాట్లు చేసుకుని శరీరానికి కావలసిన ఆహారాలను తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి వారి సూచనల ప్రకారం థైరాయిడ్‌ సమస్యతో ఉన్నవారు తీసుకోవలసిన ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..

హైపోథైరాయిడ్ లక్షణాలు: హైపో థైరాయిడ్ సమస్యతో బాధపడేవారిలో బరువు పెరగడం, చర్మం పొడిబారడం, జుట్టు సమస్యలు, హృదయ స్పందనలో తగ్గుదల, చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం, ముఖంలో వాపులు, కండరాల అసౌకర్యం, మలబద్దకం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

హైపర్‌ థైరాయిడిజం లక్షణాలు: హైపో థైరాయిడ్ మాదిరిగానే హైపర్ థైరాయిడిజంలో కూడా కొన్ని రకాల సూచనలు కనిపిస్తాయి. అయితే హైపో థైరాయిడ్‌కి వ్యతిరేకంగా ఈ సమస్య ఉన్నవారిలో బరువు తగ్గడం, హృదయ స్పందన పెరగడం, ఆందోళన, చిరాకు, నిద్రలేమి, ఏకాగ్రత సమస్యలు, ఆకలి పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

థైరాయిడ్ ఉన్నవారు తీసుకోవలసిన ఆహారాలు:

చేప‌లు: థైరాయిడ్ ఉన్నవారు చేపలను తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చేప‌ల్లో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు హైపో థైరాయిడ్ స‌మ‌స్యతో ఇబ్బందులు పడేవారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇవి ముఖంలోని వాపులు తగ్గిస్తాయి.  ఇంకా థైరాయిడ్‌, నాడీ మండ‌ల వ్యవ‌స్థలను సక్రమంగా పని చేసేలా చేస్తాయి. ఫలితంగా థైరాయిడ్ స‌మ‌స్య నుంచి బ‌య‌టపడే అవకాశం ఉంటుంది.

ఫైబ‌ర్: థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవారు ఫైబర్‌ కంటెంట్‌ ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ఫైబర్‌ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకుంటే హైపో థైరాయిడ్‌ సమస్య నుంచి బయటపడవచ్చు.

మొలకెత్తిన విత్తనాలు: థైరాయిడ్‌తో బాధపడేవారు మొలకెత్తిన అవిసె గింజలు, చియా సీడ్స్‌ను తీసుకోవడం చాలా ఉత్తమం. ఇవి శరీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అందించి థైరాయిడ్‌ గ్రంథి మెరుగ్గా పని చేసేలా ప్రభావితం చేస్తాయి.

కొబ్బరినూనె: థైరాయిడ్‌ సమస్య ఉన్నవారిలో మెటబాలిజం క్రమబద్దంగా ఉండకపోవడంతో ఒకేసారి బ‌రువు పెర‌గ‌డ‌మో లేదా అకస్మాత్తుగా బ‌రువు తగ్గడం జరుగుతుంది. కానీ వీరు కొబ్బరినూనెను నిత్యం తీసుకుంటే అందులో ఉండే మీడియం-చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు మెట‌బాలిజాన్ని మెరుగు ప‌రుస్తాయి. ఫలితంగా అలసట తగ్గడంతో పాటు జీర్ణవ్యవ‌స్థ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. క్రమక్రమంగా హైపో థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

(గమనిక: అందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం