- Telugu News Photo Gallery Health benefits with Mango Leaves; from diabetes treatment to skin care and beyond
Healthcare Tips: పండ్లతోనే కాదు, మామిడి ఆకులతోనూ ఎన్నో ప్రయోజనాలు.. డయాబెటీస్ నుంచి బీపీ వరకు ఎన్నో లాభాలు..
వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లు అన్నీ కూడా మామిడి పండ్లతో నిండిపోతాయి. మామిడిపండ్లతో ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అయితే పండ్లతోనే కాక మామిడి ఆకులతో కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అవును, శుభకార్యాలలో ఇంటికి తోరణంగా కట్టే మామిడి ఆకులు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమైనవి. మరి మామిడి ఆకులతో ఉన్న ప్రయోజనాలేమిటో ఇప్పుడే చూస్తేద్దాం..
Updated on: May 11, 2023 | 5:02 PM

డయాబెటిస్: మామిడి ఆకులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రయోజనాలను పొందడం కోసం మీరు నీటిలో మామిడి ఆకులను మరిగించి తాగితే చాలు. మీ శరీరంలోని బ్లడ్ షుగర్‌ని సులభంగా నియంత్రించవచ్చు.

జీర్ణ ఆరోగ్యం: మామిడి ఆకులను సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో అతిసారం, మలబద్ధకం, కడుపు పూతల వంటి వివిధ జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఆకులను నీళ్లలో వేసి మరిగించి దాని టీ తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం పొందవచ్చు.

చర్మ సంరక్షణ: మామిడి ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ముఖంపై మొటిమలు, చర్మంపై తామర, సోరియాసిస్‌తో సహా వివిధ చర్మ వ్యాధులకు చక్కని నివారిణి. చర్మ సంరక్షణ కోసం మామిడి ఆకులను మెత్తగా పేస్ట్‌గా చేసి స్కిన్ ప్రొబ్లమ్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి.

నోటి ఆరోగ్యం: నోటి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మామిడి ఆకులను సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఆకులను నీటిలో ఉడకబెట్టి, దాని నీటిని చిగుళ్ల వ్యాధి, పంటి నొప్పితో సహా వివిధ నోటి ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు.

కిడ్నీలో రాళ్ల నివారణ: మామిడి ఆకులు మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీని కోసం ఒక గ్లాసు నీటిలోచెంచా మామిడి ఆకుల పొడిని వేసి రాత్రంతా ఇలాగే వదిలేయండి. ఉదయాన్నే ఈ నీటిని తాగితే మూత్రం ద్వారా మూత్రపిండాల్లోని రాళ్లు కూడా శరీరం నుంచి బయటకు పోతాయి.

బీపీ కంట్రోల్: మామిడి ఆకులు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇందుకోసం మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి, కషాయంగా సేవించండి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

జుట్టు సంరక్షణ: మామిడి ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టు పెరుగుదలలో సహాయపడతాయి. ఇవి జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడడంతో పాటు కేశాల పెరుగుదలకు సహకరిస్తాయి. అలాగే చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలను నిరోధించడంలో కూడా ఉపకరిస్తాయి.

శ్వాసకోశ ఆరోగ్యం: మామిడి ఆకులు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు ఈ వ్యవస్థ ఆరోగ్యానికి ప్రయోజనంగా ఉంటుంది. ఇందుకోసం కూడా మీరు మామిడి ఆకులను మరిగించి తాగితే సరిపోతుంది.





























