MS Dhoni: ‘చిరుత లాంటి ధోనిని అలా చూడలేకపోతున్నా’.. మహీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ విచారం.. ఇంకా ఏమన్నాడంటే..?

CSK vs DC: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అంతేకాక ఈ విజయంతో ధోని సేన ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌కు మరింత దగ్గరైంది. ఇక ఈ మ్యాచ్‌లో ధోని తన బ్యాట్‌ని గట్టిగానే..

MS Dhoni: ‘చిరుత లాంటి ధోనిని అలా చూడలేకపోతున్నా’.. మహీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ విచారం.. ఇంకా ఏమన్నాడంటే..?
Ms Dhoni
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 11, 2023 | 4:37 PM

CSK vs DC: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అంతేకాక ఈ విజయంతో ధోని సేన ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌కు మరింత దగ్గరైంది. ఇక ఈ మ్యాచ్‌లో ధోని తన బ్యాట్‌ని గట్టిగానే ఝులిపించాడు. ఆడిన 9 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్ మధ్యలో ధోని అభిమానులు కొంత ఆందోళనకు లోనయ్యారు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోని కుంటుతూ కనిపించడమే ఇందుకు కారణమని చెప్పుకోవాలి. దీంతో నెట్టింట ధోని ఫిట్‌నెస్‌పై తెగ చర్చ జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌లో కామెంటరీ చేస్తున్న టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ధోని పరిస్థితి చూసి తనకు గుండె పగిలిపోయిందంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇర్ఫాన్ తన ట్వీట్‌లో ‘‘వికెట్ల మధ్య ధోని అలా కుంటుతూ పరిగెత్తడం చూసి నా హృదయం ముక్కలైంది. తనను ఎప్పుడూ వేగానికి మారుపేరైన చిరుతలా పరిగెత్తడం చూశాం’’ అంటూ రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు చెన్నై టీమ్ హెడ్‌కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ధోని పూర్తిగా ఫిట్‌గా లేడని కొందరు నమ్ముతున్నా, అతను మైదానంలోకి వస్తూనే ఉన్నాడు. అయితే నిన్న జరిగిన మ్యాచ్‌తో ధోని పూర్తి ఫిట్‌గా లేడని స్పష్టమైందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ధోని తన ఫిట్‌నెస్ ఎలా ఉన్నా.. ఈ సీజన్‌లో 48 సగటుతో మొత్తం 96 పరుగులు చేసాడు. ఈ క్రమంలో మహీ స్ట్రైక్ రేట్ 200కి పైగా ఉండడం విశేషం. ఇంకా ఈ టోర్నీలోనే ధోని 10 సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టడంతో పాటు.. వికెట్ కీపర్‌గా 6 క్యాచ్‌లు, 2 స్టంప్‌ ఔట్స్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..