Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo Mobiles: వివో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్.. అందుబాటు ధరలో అద్భుత ఫీచర్లు.. లాంచ్ డేట్ ఎప్పుడంటే..?

Vivo Y78 5G: భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి ఆదరణ కలిగిన వివో కంపెనీ తన కస్టమర్ల కోసం మరో ఫోన్‌ని తీసుకురానుంది. అత్యుత్తమ కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్‌ వంటి ఫీచర్లతో కూడిన లో కాస్ట్ మొబైల్స్‌ కోసం వీవో చాలా ప్రసిద్ధి. ఈ క్రమంలోనే..

Vivo Mobiles: వివో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్.. అందుబాటు ధరలో అద్భుత ఫీచర్లు.. లాంచ్ డేట్ ఎప్పుడంటే..?
Vivo Y78 5g
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 11, 2023 | 2:56 PM

Vivo Y78 5G: భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి ఆదరణ కలిగిన వివో కంపెనీ తన కస్టమర్ల కోసం మరో కొత్త ఫోన్‌ని తీసుకురానుంది. అత్యుత్తమ కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్‌ వంటి ఫీచర్లతో కూడిన లో కాస్ట్ మొబైల్స్‌ కోసం వీవో చాలా ప్రసిద్ధి. ఈ క్రమంలోనే Vivo Y78 5G అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూడా అద్దిరిపోయే ఫీచర్లతో ఈ నెల 17న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు, ధర వివరాల విషయానికొస్తే ఇందులో మూడు రకాల వేరియంట్లు ఉన్నాయి. వాటిలో 8GB RAM + 128GB వేరియంట్, GB RAM + 256GB స్టోరేజ్ మోడల్, 12GB RAM + 256GB వేరియంట్ అని మూడు ఉన్నాయి. ఇక వాటి ధర విషయానికోస్తే మొదటి వరియంట్ ధర సుమారు రూ.16,600. అలాగే రెండో మోడల్ ఫోన్ ధర భారతదేశంలో రూ. 20,120, మూడో వేరియంట్ కాస్ట్ రూ. 23,675 గా ఉందనుంది.

ఇప్పటికే చైనాలో మంచి ఆదరణ పొందుతున్న ఈ ఫోన్ ప్రత్యేకతలేమిటంటే ఇందులో 6.64-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో 1,080 x 2,388 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌ ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను, MediaTek DimCity 7020 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇంకా Android 13 ఆధారిత FunTouch 3 OS మద్దతుతో ఈ ఫోన్ పని చేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే Vivo Y78 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. వాటిలో ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్, రెండో కెమెరా 2 మెగా పిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది. ఇదే కాకుండా, 8 మెగా పిక్సెల్ సెన్సార్ సామర్థ్యంతో సెల్ఫీ కెమెరా సెటప్ ఉంది. కెమెరా ఫీచర్లలో నైట్ మోడ్, పోర్ట్రెయిట్ లైట్ ఎఫెక్ట్, వీడియో ఫేస్ బ్యూటీ వంటి అనేక ఇతర ఎడిటింగ్ ఎంపికలు కూడా ఉండడం దీని ప్రత్యేకత.

అన్ని ఫీచర్ల మాదిరిగానే ఈ ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యం కూడా ఆకర్షణీయంగానే ఉంది. 5,000mAh బ్యాటరీతో రాబోతున్న ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సప్పోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G సపోర్ట్, బ్లూటూత్ 5.0, 4G LTE, Wi-Fi, 5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ కూడా ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇందులో ఇన్‌స్టాల్ చేయబడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో