Aadhaar: ఆధార్‌ నంబర్‌తో బ్యాంకు ఖాతాను హ్యాక్‌ చేయగలరా? యూఐడీఏఐ ఏం చెబుతోంది?

బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ కావడం వల్ల ఆధార్ నంబర్ ద్వారా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేస్తారా? అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఈ అంశంపై యూఐడీఏఐ స్పస్టత ఇచ్చింది. ఆధార్ నంబర్ ద్వారా బ్యాంక్ ఖాతా హ్యాక్ చేయడం వీలుకాదని తెలిపింది. అది ఎలాగో చూద్దాం రండి..

Aadhaar: ఆధార్‌ నంబర్‌తో బ్యాంకు ఖాతాను హ్యాక్‌ చేయగలరా? యూఐడీఏఐ ఏం చెబుతోంది?
Aadhaar Card
Follow us
Madhu

|

Updated on: May 11, 2023 | 12:45 PM

పెరుగుతున్న ఆధునిక సాంకేతికత మనిషిని భయం గుప్పిట బతికేలా చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎంతలా సెక్యూరిటీ టెక్నిక్‌ లు వినియోగిస్తున్నా సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకు సంబంధమైన డేటా విషయంలో జాగ్రత్త చాలా అవసరం. అయితే ప్రస్తుతం ప్రతి బ్యాంకు ఖాతాకు ఆధార్‌ నంబర్‌ లింక్‌ అవుతోంది. ఆధార్‌ నంబర్‌తోనే మనం చాలా లావాదేవీలను ప్రస్తుతం పూర్తి చేసే డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ చాలానే ఉన్నాయి. మరి అలాంటప్పుడు మీకు ఓ సందేహం కలుగవచ్చు. మన ఆధార్‌ నంబర్‌ ఒకటి తెలిస్తే మన బ్యాంకు లావాదేవీలు పూర్తి చేయొచ్చా? ఆధార్‌ నంబర్‌ ద్వారా బ్యాంకు అకౌంట్‌ ను హాక్‌ చేయొచ్చా? ఈ ప్రశ్నలు సాధారణంగానే చాలా మందికి వస్తాయి. అందుకే వీటికి యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) స్పష్టమైన సమాధానం ఇచ్చింది. అవేందో చూద్దాం..

అన్నింటికీ ఆధారే ఆధారం..

మన దేశంలో అన్నింటికీ ఆధార్‌ నంబరే ఆధారం. 12 సంఖ్యలతో ఉండే ఈ నంబర్‌ ప్రతి పౌరుడు కలిగి ఉండాల్సిందే. లేకుంటే మనదేశ పౌరుడిగా గుర్తింపు ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ పథకం కావాలన్నా ఈ నంబరే ఆధారం. ఇప్పుడు దీనిని పాన్‌ కార్డు, బ్యాంకు అకౌంట్లు, ఓటర్ ఐడీలకు కూడా అనుసంధానం చేశారు. ఒక్క ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే వ్యక్తి పూర్తి బయోడేటా వచ్చేస్తోంది. పేరు, అడ్రస్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, వంటి వివరాలు తెలిసిపోతాయి.

ఆధార్‌తో అకౌంట్‌ హ్యాక్‌ చేయొచ్చా..

బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ కావడం వల్ల ఆధార్ నంబర్ ద్వారా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేస్తారా? అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఈ అంశంపై యూఐడీఏఐ స్పస్టత ఇచ్చింది. ఆధార్ నంబర్ ద్వారా బ్యాంక్ ఖాతా హ్యాక్ చేయడం వీలుకాదని తెలిపింది. కేవలం ఒక్క ఆధార్ నంబర్ ద్వారా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయలేరని స్పష్టం చేసింది. అయితే ఓటీపీ, పిన్ నంబర్, పాస్‌వర్డ్ వంటివి చెబితే మాత్రం ఖాతా లూటీ కావడం ఖాయమని హెచ్చరించింది. అందుకే ఎవ్వరికీ ఓటీపీ, పిన్‌ నంబర్‌, అకౌంట్‌ పాస్‌ వర్డ్‌ వంటివి తెలియకుండా చూసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

వ్యక్తిగత డేటా భద్రమేనా?

మన డేటా మొత్తం ఆధార్‌ పేరిట యూఐడీఏఐ వద్ద నిక్షిప్తమై ఉంటుంది. మరి వాటిని ఆ సంస్థ వేరే వాటికి వినియోగిస్తే.. వేరే వారికి ఇచ్చేస్తే అనే అనుమానం కలుగవచ్చు. కానీ అది కూడా సాధ్యం కాదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఆధార్‌ చట్టం 2016 సెక‌్షన్‌ 32(3) ప్రకారం పూర్తి భద్రత కల్పిస్తుందని చెప్పింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు