Instagram Reels: ఈజీగా ఇన్‌స్టా‌గ్రామ్ రీల్స్ డౌన్‌లోడ్ చేసుకోండి.. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండానే..

గూగుల్ ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేసుకొని వాటి ద్వారా ఇన్ స్టా రీల్స్ డౌన్ లోడ్ చేస్తున్నారు. అయితే ఇది ప్రమాదకరం. ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా ఇప్పుడు చాలా మోసాలు వెలుగు చూస్తున్నాయి.

Instagram Reels: ఈజీగా ఇన్‌స్టా‌గ్రామ్ రీల్స్ డౌన్‌లోడ్ చేసుకోండి.. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండానే..
Instagram Reels
Follow us

|

Updated on: May 11, 2023 | 12:15 PM

ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ ప్రపంచంలో ఏమూలన ఏం జరిగినా క్షణంలో అరచేతిలో ప్రత్యక్షమవుతోంది. అయితే వీటిల్లో ఇటీవల బాగా ప్రాచుర్యం పొందించి ఇన్ స్టా రీల్స్. దీనికి యువత బాగా కనెక్ట్ అయ్యింది. కొంతమంది తమ ట్యాలెంట్ చూపించుకోవడానికి దీనిని వినియోగిస్తుండగా.. కొందరు సమాచారాన్ని చేరవేయడానికి, మరికొందరు ఎంటర్టైన్మెంట్ కోసం రీల్స్ చేస్తుంటారు. ఎంత మొత్తంలో రీల్స్ చేస్తున్నారో.. అదే విధంగా ఇన్ స్టా వినియోగదారులు వాటిని చూసి కామెట్లు, లైక్లు ఇస్తుంటారు.

అయితే ఆ రీల్స్ ని చూసి ఎంజాయ్ చేస్తూ కామెంట్లు, లైక్ ఇచ్చే వారు.. వాటిని డౌన్ లోడ్ చేయడం మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పుడు చాలా మంది చేసే పని.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేసుకొని వాటి ద్వారా ఇన్ స్టా రీల్స్ డౌన్ లోడ్ చేస్తున్నారు. అయితే ఇది కాస్త ప్రమాదకరం. ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా ఇప్పుడు చాలా మోసాలు వెలుగు చూస్తున్నాయి. మీ వ్యక్తిగత డేటా కూడా చోరీకి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ యాప్ లేకుండా సులభంగా ఇన్ స్టా గ్రామ్ రీల్స్ డౌన్ లోడ్ చేసుకొనే విధానాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. అదెలాగో ఇప్పడు చూద్దాం..

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌ను తెరిచి, మీరు సేవ్ చేయాలనుకుంటున్న రీల్‌ను ఎంచుకోండి.
  • కాగితపు విమానం చిహ్నం వలె కనిపించే షేర్ ఐకాన్ పై నొక్కండి.
  • మీకు ఓపెన్ అయిన మెనూ జాబితా నుండి, “యాడ్ రీల్ టు యువర్ స్టోరీ” ని ఎంచుకోండి. తదుపరి స్క్రీన్‌ పైన కుడి వైపు మూలన మూడు చుక్కలు మీకు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి “సేవ్” బటన్ పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత స్క్రీన్ పైన ఎడమ మూలలో ఉండే డిస్కార్డ్ స్టోరీ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.
  • మీరు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఫోల్డర్‌లో సేవ్ చేసిన రీల్‌ను గుర్తించవచ్చు, దీన్ని మీ పరికరం యొక్క ఫైల్ మేనేజర్ మరియు గ్యాలరీ అప్లికేషన్‌ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

ఇది ఎలా సురక్షితమైనదంటే..

ఇది అధికారికంగా ఇన్ స్టా గ్రామ్ ఇచ్చిన ఫీచర్. అందువల్ల దీంతో మీ ప్రైవసీకి, సెక్యూరిటీకి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు. పైగా ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేయడం లేదు కాబట్టి మీ డేటా చోరీ అయ్యే అవకాశమే లేదు. సేవ్ చేసిన రీల్ మీ గేలరీలోనే సేవ్ అవుతుంది కాబట్టి ఎక్కడా సెక్యూరిటీ సమస్య రాదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..