Paytm New Features: సరికొత్తగా పేటీఎం.. మూడు అదిరే ఫీచర్లతో వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు.. పూర్తి వివరాలు

ప్రజలతో కనెక్ట్‌ అయిన పేటీఎం ఇప్పుడు తన పరిధిని మరింత విస్తృతం చేసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా సంస్థ సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. యాపిల్‌ ఐఫోన్లకు సంబంధించిన ఐఓఎస్‌లో యూపీఐ లైట్‌ ఫీచర్‌, యూపీఐకి రూపే క్రెడిట్‌ కార్డ్‌ యాడింగ్‌, స్ల్పిట్‌ బిల్‌ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.

Paytm New Features: సరికొత్తగా పేటీఎం.. మూడు అదిరే ఫీచర్లతో వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు.. పూర్తి వివరాలు
Paytm
Follow us

|

Updated on: May 11, 2023 | 11:45 AM

మన దేశంలో బ్యాంకింగ్‌ రంగం అ‍త్యంత వేగంగా డిజిటల్‌ బాట పడుతోంది. ముఖ్యంగా కరోనా అనంతర పరిణామాల్లో భాగంగా అందరూ క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం, చెల్లింపులు చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ విధానాన్ని దేశంలో ప్రాచుర్యంలోకి తెచ్చిన సంస్థల్లో పేటీఎం ఒకటి. దేశంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు ఇంత వేగంగా సామాన్యులకు సైతం చేరువైందంటే దానికి పేటీఎం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. సామాన్యుల దగ్గర నుంచి వీధి వ్యాపారుల వరకూ పేటీఎం సాయంతోనే డిజిటల్‌ చెల్లింపులు ఈజీగా చేసేస్తున్నారు. అంతలా ప్రజలతో కనెక్ట్‌ అయిన పేటీఎం ఇప్పుడు తన పరిధిని మరింత విస్తృతం చేసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా సంస్థ సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. యాపిల్‌ ఐఫోన్లకు సంబంధించిన ఐఓఎస్‌లో యూపీఐ లైట్‌ ఫీచర్‌, యూపీఐకి రూపే క్రెడిట్‌ కార్డ్‌ యాడింగ్‌, స్ల్పిట్‌ బిల్‌ మొబైల్ నంబర్‌లకు బదులుగా పేటీఎం యాప్‌లో ప్రత్యామ్నాయ యూపీఐ ఐడీ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కొత్త ఫీచర్లు ఇవే..

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు లిమిటెడ్‌(పీపీబీఎల్‌) నిర్వహించిన సోషల్‌ మీడియా లైవ్‌ స్ట్రీమ్‌లో పేటీఎం వ్యవస్థాపకుడు సీఈఓ, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు చైర్మన్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ, బోర్డు సభ్యుడు భవేష్‌ గుప్తా పీపీబీఎల్‌ సీఈవో సురిందర్‌ చావ్లా కంపెనీ తీసుకొచ్చిన కొత్త ఫీచర్లను ప్రకటించారు. అవేంటంటే..పేటీఎం యూజర్లు ఇప్పుడు రూపే క్రెడిట్‌ కార్డ్‌ను పేటీఎం యాప్‌లో యూపీఐ ఐడీతో లింక్‌ చేసుకోవచ్చు. అలాగే బిల్లులను స్ల్పిట్‌ చేసుకోవచ్చు. అంటే ఏదైనా బిల్లును స్నేహితుల సమూహంలో విభజించి చెల్లించవచ్చు. గూగుల్‌ పే, ఫోన్‌ పేలలో ఈ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులో ఉంది. అలాగే పేటీఎంలో చేసిన అన్ని చెల్లింపులను ట్యాగ్‌ చేయవచ్చు. అదే విధంగా ట్యాగ్‌ చేసిన చెల్లింపులను ఎ‍ప్పుడైనా చూసుకోవచ్చు.

పేమెంట్‌ ఫెయిల్యూర్‌ సమస్యలకు చెక్‌..

ఇక ఫిబ్రవరిలో ప్రారంభించిన సంచలనాత్మక యూపీఐ లైట్‌ ఫీచర్‌ తాజాగా యాపిల్‌ ఐఓఎస్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. చెల్లింపులను క్రమబద్ధీకరించడం, లావాదేవీలు ఫెయిల్యూర్‌ సమస్యను తొలగించడం దీని ప్రాథమిక లక్ష్యం. దీని ద్వారా ఇప్పుడు పిన్‌ ను నమోదు చేయకుండానే రూ. 2000 వరకూ చెల్లింపులు చేయవచ్చు. యూపీఐ లైట్‌కి రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2,000 జోడించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..