Ambati Rayudu: సీఎం జగన్‌తో రాయుడు భేటీ.. రాజకీయ రంగప్రవేశం ఖాయమేనా..?

Ambati Rayudu: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అధికార వైసీపీలో చేరే సూచనలు నిండుగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే సీఎం వైయస్ జగన్ ప్రసంగాన్ని రీట్వీట్ చేసి చర్చనీయాంశంగా మారిన రాయుడు.. ఇప్పుడు తాడేపల్లిలో సీఎం క్యాంపు..

Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 11, 2023 | 5:19 PM

Ambati Rayudu: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అధికార వైసీపీలో చేరే సూచనలు నిండుగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే సీఎం వైయస్ జగన్ ప్రసంగాన్ని రీట్వీట్ చేసి చర్చనీయాంశంగా మారిన రాయుడు.. ఇప్పుడు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే నేరుగా ముఖ్యమంత్రి జగన్తో భేటి అయిన రాయుడు ఆయనతో ఏం మాట్లాడాడనేది ఇంకా తెలియరాలేదు.

గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు 2013-19 మధ్యకాలంటో భారత జట్టుకు ఆడాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకుని ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్నిరోజుల కిందట సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ ప్రసంగించగా, ఆ స్పీచ్‌ను అంబటి రాయుడు రీట్వీట్ చేశారు. అంతేకాక ‘ఏపీలో ప్రతి ఒక్కరికీ మీపై విశ్వాసం ఉంది సార్’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. అంతలోనే నేడు సీఎం జగన్‌తో భేటీ అయ్యాడు. దీంతో రాయుడు రాజకీయాలలోకి రంగప్రవేశం చేస్తున్నాడేమోనని సర్వత్రా చర్చ సాగుతోంది.

ఇవి కూడా చదవండి

కాగా, రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాజకీయాల్లోకి రావడంపై కొంతకాలంగా ఆసక్తి చూపుతున్న రాయుడు జనసేనలో చేరతాడని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాయుడు వైసీపీలో చేరడతానే వాదనలకు బలం చేకూరుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పోటీ ఉండనున్న నేపథ్యంలో.. సీఎం జగన్ కాపు నేతలపై ఫోకస్ చేశారని.. ఆ నేపథ్యంలోనే రాయుడును పార్టీలో చేర్చుకుంటే మంచిదని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా సీఎం జగన్‌ని రాయుడు ఎందుకు భేటీ అయ్యాడో తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే..

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..