Cyclone Mocha: ఏపీ ప్రజలకు అలెర్ట్.. తుఫాన్‌గా మారిన వాయుగుండం.. ఈ 3 రోజుల్లో వర్షపు సూచన..

Weather Forecast: బుధవారం ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ ‘మోచా’ లేక ‘మొఖా’ తుఫాన్ పోర్టుబ్లెయిర్కు నైరుతిదిశలో 510 కిలోమీటర్లు దూరంలో ,కాక్స్ బజార్ (బాంగ్లాదేశ్) కు దక్షిణ నైరుతి దిశలో 1190 కిలోమీటర్ల దూరంలో, సీత్త్వే (మయన్మారుకు) దక్షిణ -నైరుతి దిశలో 1100 కిలోమీటర్ల దూరంలో..

Cyclone Mocha: ఏపీ ప్రజలకు అలెర్ట్.. తుఫాన్‌గా మారిన వాయుగుండం.. ఈ 3 రోజుల్లో వర్షపు సూచన..
Ap Weather Report
Follow us

|

Updated on: May 11, 2023 | 3:24 PM

Weather Forecast: బుధవారం ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ ‘మోచా’ లేక ‘మొఖా’గా మారి తుఫాన్ పోర్టుబ్లెయిర్కు నైరుతిదిశలో 510 కిలోమీటర్లు దూరంలో ,కాక్స్ బజార్ (బాంగ్లాదేశ్) కు దక్షిణ నైరుతి దిశలో 1190 కిలోమీటర్ల దూరంలో, సీత్త్వే (మయన్మారుకు) దక్షిణ -నైరుతి దిశలో 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ‘మోచా’ తుఫానుతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తు వెళ్ళేకొలది నైరుతి వైపు వంగి ఉంటుంది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:

గురువారం: తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4° C వరకు పెరగవచ్చు.

శుక్రవారం: వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది. ఉష్ణోగ్రతలు క్రమంగా 2° నుంచిడి 4° C వరకు పెరగవచ్చు

శనివారం: వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఉష్ణోగ్రతలు క్రమంగా 4°నుండి 6° C వరకు పెరగవచ్చు. వడగాలులు వీచే అవకాశముంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: 

గురువారం: తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4° C వరకు పెరగవచ్చు.

శుక్రవారం: వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఉష్ణోగ్రతలు క్రమంగా 2° నుంచిడి 4° C వరకు పెరగవచ్చు

శనివారం: వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది. ఉష్ణోగ్రతలు క్రమంగా 4°నుండి 6° C వరకు పెరగవచ్చు. వడగాలులు వీచే అవకాశముంది

రాయలసీమ:

గురువారం: తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4° C వరకు పెరగవచ్చు.

శుక్రవారం: వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఉష్ణోగ్రతలు క్రమంగా 2° నుంచిడి 4° C వరకు పెరగవచ్చు

శనివారం: వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఉష్ణోగ్రతలు క్రమంగా 4°నుండి 6° C వరకు పెరగవచ్చు. వడగాలులు వీచే అవకాశముంది.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..