Andhra Pradesh Economy: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే దుష్ప్రచారం.. లెక్కలతో సహా జగన్ సర్కారు వివరణ

Andhra Pradesh Economy: ఆంధప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారినట్లు, అప్పుల భారం పెరుగుతున్నట్లు వచ్చిన పలు విశ్లేషణలు, వార్తలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏపీ ఆర్థిక పరిస్థితిపై గంటా వెంకటేశ్వరరావు చేసిన విశ్లేషణపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదంతా అవగాహన లేకుండా చేస్తున్న తప్పుడు ప్రచారం అంటూ మండిపడింది.

Andhra Pradesh Economy: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే దుష్ప్రచారం.. లెక్కలతో సహా జగన్ సర్కారు వివరణ
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 11, 2023 | 5:05 PM

Andhra Pradesh Economy: ఆంధప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారినట్లు, అప్పుల భారం పెరుగుతున్నట్లు వచ్చిన పలు విశ్లేషణలు, వార్తలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏపీ ఆర్థిక పరిస్థితిపై గంటా వెంకటేశ్వరరావు చేసిన విశ్లేషణపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదంతా అవగాహన లేకుండా చేస్తున్న తప్పుడు ప్రచారం అంటూ మండిపడింది. ఆర్థిక అంశాల్లో మాట్లాడాలంటే అనుభవం ఉండాలని.. లేదా ఏదైనా ఆర్థిక కోర్సు అయినా చేసి ఉండాలంటూ పేర్కొంది. లేని అపోహలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టడం ఏంటంటూ ప్రశ్నించింది. ఇలా చేస్కతే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తూనే అసలు విషయాలను పంచుకుంది. తప్పుడు ప్రచారాల వెలుగులో.. “ఆర్థిక నిపుణులు” అని పిలవబడే వ్యక్తులు కొన్ని మీడియా విభాగాల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై బాధ్యతారాహిత్యమైన, తార్కిక ప్రకటనలు చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించడం, పుకార్లు, భయాందోళనలు సృష్టించడం శోచనీయమంటూ ఏపీ ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు గురువారం ట్వీట్ చేసి వాస్తవాలు ఇవంటూ ప్రకటించింది.

‘‘2014-19లో బాకీలు 169% పెరిగాయని.. వ్యయం 21.87% పెరిగిందని పేర్కొంది. 2019-23లో బాకీ ఉన్న అప్పులు కేవలం 58% మాత్రమే పెరిగాయి, సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు 12.69% మాత్రమే ఉంది. ఉచితాలు నిజమైన ప్రయోజనం లేని కార్యక్రమాలు, ఓటర్లను ప్రలోభపెట్టే ఉద్దేశ్యంతో మాత్రమే అమలు చేస్తాయని ప్రచారం చేశారు. ఉదాహరణకు గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు రోజుల ముందు 9 ఏప్రిల్, 2019న ఒకే రోజున SDL వేలం ద్వారా 5,000 కోట్లు తీసుకుంది. తప్పుదారి పట్టించే కథనంలో ఉన్న వాటిని విశ్వసిస్తే, మునుపటి ప్రభుత్వం చేసిన మొత్తం రుణాలు మూలధన వ్యయం కోసం మాత్రమే అంటూ అవాస్తవంగా ఉంది. ఇది నిజమైతే, 2014-19లో ప్రతి సంవత్సరం రెవెన్యూ మిగులు ఉండాలి. కానీ అలా లేదు.. ఆర్టికల్‌లో ఉన్న ఆరోపణలు పబ్లిక్ ఫైనాన్స్ గురించి ఆర్థిక విజర్డ్ అని పిలవబడే అవగాహన లేకపోవడం గురించి మాట్లాడుతున్నాయి. అతను ఆరోపించినట్లుగా మూలధన వ్యయంలో అసలు తగ్గింపు లేదు. గత ప్రభుత్వ పనితీరుతో పోల్చినప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో మూలధన వ్యయం నిరుత్సాహకరంగా లేదు.’’ పుంజుకుంటూనే ఉందంటూ జగన్ ప్రభుత్వం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

కావాలనే దుష్ప్రచారం.. దువ్వూరి కృష్ణ

ఏపీ ఆర్థిక పరిస్థితిపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ. నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందున్న అప్పు ఎంత? ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు ఎంత అన్నది లెక్కలతో సహా వివరించారు దువ్వూరి కృష్ణ. AP అప్పుల ఊబిలో ఉందన్న ఆరోప‌ణ‌లు ఖండిస్తున్నామంటూ పేర్కొన్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చే నాటికి అప్పు- రూ. 2,71, 797 కోట్లు, ఈ ఏడాది మార్చి 31 నాటికి అప్పులు – రూ. 4,36,522 కోట్లు, ఈ 4 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అప్పు – రూ. 1,64,725 కోట్లు, టీడీపీ హ‌యాంలో అప్పుల వార్షిక వృద్ధిరేటు 19 శాతం.. వైసీపీ ప్రభుత్వంలో అప్పుల వార్షిక వృద్ధిరేటు 13.55 శాతం అంటూ వివరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..