Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ సంకేతాలు కనిపిస్తే మరణం ఆసన్నం అయినట్లట
సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ప్రాముఖ్యత ఉంది. దీనిని మహా పురాణం అని కూడా అంటారు. ఈ గ్రంథం ప్రజలకు మంచి చెడు కర్మల గురించి అందుకు లభించే ఫలితాల గురించి చెబుతూ.. మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. అంతేకాదు మరణించిన వ్యక్తుల దగ్గరగరుడ పురాణం పఠించడం వల్ల మరణించిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ మత విశ్వాసం. అయితే గరుడ పురాణం ఒక వ్యక్తి చనిపోయే కొద్దిసేపటి ముందు ఎలాంటి విషయాలను చూస్తాడో వివరంగా వివరించింది. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..
పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. మరణం జీవిత చక్రంలో ఒక భాగం. మరణాన్ని కోరుకున్నప్పటికీ ఎవరూ తప్పించుకోలేరు. అయితే మరణం అంచుల వద్ద ఉన్న వ్యక్తికి అనేక విషయాలు కనిపిస్తాయని అంటారు. గరుడ పురాణంలో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. గరుడ పురాణం విష్ణువుకు అంకితం చేయబడింది. హిందూ మతంలో 18 మహాపురాణాలు ఉన్నాయి. అందులో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని హిందూ మత విశ్వాసం. ఎవరైనా మరణించే కొద్ది సేపటికి ముందు కొన్ని విషయాలను చూస్తాడని గరుడ పురాణం వివరించింది. ఈ రోజు మరణానికి ముందు చూసే విషయాలు ఏమిటో తెలుసుకుందాం..
- యమ దూత రూపము గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మరణానికి చెరువులతో ఉన్న సమయంలో అతనికి యమదూతలు కనిపిస్తారట. కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో యమ దూతలు కనిపిస్తారని నమ్ముతారు.
- రహస్యమైన తలుపు జీవితం చివరి క్షణాలలో ఉన్న వారు ఒక రహస్యమైన తలుపును చూస్తాడు. గరుడ పురాణం ప్రకారం ఈ రహస్యమైన తలుపు నుంచి ప్రకాశవంతమైన తెల్లని కాంతి వెలువడుతుంది. అది మరణ సమయం ఆసన్నమైందనడానికి సంకేతమని నమ్మకం.
- నీడను చూడలేకపోవడం మరణానికి ముందు అనేక అశుభ సంకేతాలు కనిపిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. మరణం సమీపించిన వ్యక్తులు తమ ప్రతిబింబాన్ని నీరు, నూనె, నెయ్యి, అద్దంలో కూడా చూడలేరు. ఇలా ప్రతిబింబం కనిపించక పోతే మరణ సమయం ఆసన్నమైందనడానికి కూడా ఒక సంకేతమని నమ్ముతారు.
- పితృ దర్శనం ఒక వ్యక్తి మరణానికి ముందు తమ పూర్వీకులను చూస్తాడని గరుడ పురాణంలో చెప్పబడింది. ఇలా జరిగితే మరణ సమయం దగ్గర పడిందనడానికి సంకేతంగా కూడా భావిస్తారు.
గరుడ పురాణం ఎప్పుడు పఠిస్తారు?
ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణాన్ని పఠిస్తారు. మరణించినవారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. ఈ సమయంలో గరుడ పురాణం పారాయణం చేస్తే మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.