KKR vs RR: చాహల్ స్పిన్ మాయలో పడిపోయిన కోల్‌కతా బ్యాటర్లు.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే..?
KKR vs RR: ఐపీఎల్ 16వ సీజన్ 56వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో కోల్‌కతా టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో కోల్‌కతా నైట్..
KKR vs RR: ఐపీఎల్ 16వ సీజన్ 56వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో కోల్‌కతా టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగుల చేసింది. ఇక కోల్‌కతా తరఫున వెంకటేష్ అయ్యర్(57) అర్థసెంచరీతో రాణించగా.. కెప్టెన్ నితీష్ రాణా(22), ఓపెనర్ రహ్మతుల్లా గుర్భాజ్(18) పరుగులతో పర్వాలేదనిపించారు. ఈ ముగ్గురు మినహా రస్సెల్, రింకూ సింగ్ సహా మిగిలినవారంత పరుగులు తీయడానికి కొంచెం మొహమాటపడ్డారని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో విజృంభించాడు. అలాగే ఆరంభంలోనే కోల్‌కతా ఓపెనర్లు ఇద్దరినీ కూడా ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్ బాట పట్టించాడు. కేఎమ్ అసిఫ్, సందీప్ శర్మ కూడా చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఎదుట 150 పరుగుల లక్ష్యం ఉంది.
Innings Break!
An exceptional effort in the field by the @rajasthanroyals as they restrict KKR to a total of 149/8 on the board.
Scorecard – https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/A6XuSJkPgr
— IndianPremierLeague (@IPL) May 11, 2023
KKR vs RR తుది జట్లు..
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/(కెప్టెన్)), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కేఎమ్ ఆసిఫ్, యుజువేంద్ర చాహల్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..