KKR vs RR: 13 ఫోర్లు, 5 సిక్స్‌లు.. 47 బంతుల్లో 98 నాటౌట్.. జైస్వాల్ శివతాండవం.. కోల్‌కతాపై రాజస్థాన్ ఘనవిజయం
టీమిండయా భవిష్యత్ ఆశా కిరణం యశస్వి జైస్వాల్ మళ్లీ చెలరేగాడు. కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి రాజస్థాన్‌ను అవలీలగా గెలిపించాడు. 150 పరుగుల లక్ష్య ఛేదనలో ఆది నుంచే విరుచుకుపడిన జైస్వాల్ కేవలం 47 బంతుల్లో 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

టీమిండయా భవిష్యత్ ఆశా కిరణం యశస్వి జైస్వాల్ మళ్లీ చెలరేగాడు. కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి రాజస్థాన్‌ను గెలిపించాడు. 150 పరుగుల లక్ష్య ఛేదనలో ఆది నుంచే విరుచుకుపడిన జైస్వాల్ కేవలం 47 బంతుల్లో 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉండడం విశేషం. జైస్వాల్‌కు తోడు సంజూశామ్సన్ (29 బంతుల్లో 48) కూడా ధాటిగా ఆడడంతో రాజస్థాన్ మరో 41 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వరుస ఓటములకు చెక్ పెట్టినట్లయ్యింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది రాజస్థాన్. ప్లే ఆఫ్ అవకాశాలు కూడా మెరుగయ్యాయి. మరోవైపు 12 మ్యాచుల్లో ఏడో పరాజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లాయి. సునామీ ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్‌కు సునాయస విజయం అందించిన యశస్వికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. వెంకటేశ్ అయ్యర్(57) టాప్‌స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ నితీష్ రాణా(22), ఓపెనర్ రహ్మతుల్లా గుర్భాజ్(18) పరుగులు మాత్రమే చేశారు. మిగతా వారు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ 2, సందీప్ శర్మ, అసిఫ్ తలో వికెట్ పడగొట్టారు.




The Yashasvi effect❤️? – FASTEST 50 in #TATAIPL history!! ??#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN
— JioCinema (@JioCinema) May 11, 2023
The Grandmaster creates history. Take a bow #YuzvendraChahal, the highest wicket-taker in #TATAIPL? ? #KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @yuzi_chahal pic.twitter.com/KL93Z9rhlx
— JioCinema (@JioCinema) May 11, 2023
KKR vs RR తుది జట్లు..
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/(కెప్టెన్)), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కేఎమ్ ఆసిఫ్, యుజువేంద్ర చాహల్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..