Yashasvi Jaiswal: 98 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌తో.. కేఎల్ రాహుల్, కోహ్లీ రికార్డులకు బ్రేకులు వేసిన జైస్వాల్..
KKR vs RR, IPL 2023: ఈ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డు సృష్టించాడు. కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ (ఇద్దరూ 14 బంతులు) రికార్డులను బద్దలు కొట్టాడు.

Yashasvi Jaiswal Records: గత సీజన్‌ల మాదిరిగానే IPL 2023 కూడా ప్రతిభావంతులైన భారత యువ ఆటగాళ్లను ప్రపంచానికి అందించడంలో విజయవంతమైంది. తిలక్ వర్మ, సుయాష్ శర్మ, నెహాల్ వధేరా, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు తమ బలమైన ప్రదర్శనతో భవిష్యత్తులో టీమ్ ఇండియాకు ఆడే అవకాశాలను పెంచుకుంటున్నారు. ప్రతి మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ తుఫాన్ ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్నాడు. ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్‌లతో ప్రస్తుతం పరుగుల వర్షం కురిపిస్తూ.. అగ్రస్థానంలో నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై, అతను ఒకే ఇన్నింగ్స్‌లో అనేక మైలురాళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈడెన్ గార్డెన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ, మే 11వ తేదీ గురువారం సాయంత్రం, అది రాజస్థాన్ రాయల్స్‌కు హోమ్ గ్రౌండ్‌గా మారింది. యుజ్వేంద్ర చాహల్ అద్భుతమైన స్పెల్ తరువాత యశస్వి జైస్వాల్ తుఫాను మొదలైంది. రాజస్థాన్ టీం కోల్‌కతాను కేవలం 13.1 ఓవర్లలో 9 వికెట్ల తేడాతో కొట్టుకుపోయింది. చాహల్ 4 వికెట్లు పడగొట్టగా, జైస్వాల్ కేవలం 13 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా మొత్తం 98 పరుగులు చేశాడు.
KKR vs RR: యశస్వి-యుజ్వేంద్ర రికార్డులు..
ఈ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డు సృష్టించాడు. కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ (ఇద్దరూ 14 బంతులు) రికార్డులను బద్దలు కొట్టాడు.
ఇది మాత్రమే కాదు, యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత టీ20 క్రికెట్‌లో ఏ భారతీయుడు చేసిన రెండో వేగవంతమైన అర్ధ సెంచరీగా నిలిచింది.
రాజస్థాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్ 26 పరుగులు చేశాడు. నితీష్ రాణా వేసిన ఓవర్లో అతను 2 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇది. గతంలో పృథ్వీ షా (24) పేరిట ఉన్న రికార్డు అది కూడా కేకేఆర్‌పైనే.
ఈ ఓవర్ తొలి రెండు బంతుల్లో జైస్వాల్ సిక్సర్లు బాదాడు. ఐపీఎల్‌లో ఇన్నింగ్స్‌లో తొలి రెండు బంతులు సిక్సర్లు బాదడం ఇది రెండోసారి మాత్రమే. 2019లో వరుణ్ ఆరోన్‌పై రెండు సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీని సమం చేశాడు.
98 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆధారంగా, యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో 12 ఇన్నింగ్స్‌లలో 576 పరుగులు చేశాడు. ఈ విధంగా అతను IPL చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇషాన్ కిషన్ 516 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.
యశస్వి మాత్రమే కాదు , రాజస్థాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరిట కూడా ఒక ప్రత్యేక రికార్డు వచ్చింది. ఈ మ్యాచ్‌లో చాహల్ 4 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు (187) తీసిన బౌలర్‌గా నిలిచాడు. డ్వేన్ బ్రావో (183) రికార్డును బద్దలు కొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..