- Telugu News Photo Gallery Cricket photos Ipl 2023 kkr vs rr yashasvi jaiswal fastest fifty in ipl history break kl rahul record
Yashasvi Jaiswal: 13 బంతులు.. 3 సిక్సర్లు, 7 ఫోర్లతో తుఫాన్ హాఫ్ సెంచరీ.. ఐపీఎల్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర..
Yashasvi Jaiswal Fastest Fifty: 2011లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి ఓవర్‌లో RCB 27 పరుగులు చేసింది. అయితే ఆ ఓవర్‌లో 7 అదనపు పరుగులు వచ్చాయి.
Updated on: May 12, 2023 | 8:18 AM

IPL 2023: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ రికార్డు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యశస్వి జైస్వాల్ పేరిట చేరింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. 2018లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేవలం 14 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు.

దీని తర్వాత 2022లో కేకేఆర్ తరపున ఆడిన పాట్ కమిన్స్, ముంబై ఇండియన్స్‌పై కేవలం 14 బంతుల్లోనే కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు.

కేవలం 13 బంతుల్లో 3 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో 50 పరుగులు చేసిన జైస్వాల్.. కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ పేరిట ఉన్న రికార్డును యశస్వి జైస్వాల్ బ్రేక్ చేసేశాడు.

ఈ మ్యాచ్‌లో నితీష్ రాణా వేసిన తొలి ఓవర్‌లో 20 ఏళ్ల జైస్వాల్ 6, 6, 4, 4, 2, 4 బాదాడు. ఆ ద్వారా తొలి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు చేసిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

తొలి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. అంతకుముందు 2011లో ముంబై ఇండియన్స్‌పై RCB తొలి ఓవర్‌లో 27 పరుగులు చేసింది. అయితే ఆ ఓవర్‌లో 7 అదనపు పరుగులు వచ్చాయి.

యశస్వి జైస్వాల్ ఐపీఎల్ చరిత్రలో 2 భారీ సిక్సర్లు, మూడు ఫోర్లు, 2 పరుగులతో తొలి ఓవర్‌లో 26 పరుగులు చేసి తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.




