Golden Ice Cream: స్పెషల్ ఫ్లేవర్స్‌తో ‘బంగారపు ఐస్‌క్రీమ్’.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. వైరల్ వీడియో..

Golden Ice Cream: దేశంలోని ప్రముఖ నగరాలలో ఒకటైన సూరత్ నగరంలోని ప్రజలు ఇప్పుడు ఏకంగా బంగారాన్ని తింటున్నారు. అవును, సూరత్‌ నగరం ఆహార ప్రీయుల కోసం 24 క్యారెట్ల బంగారు పూతతో కూడిన ఐస్‌క్రీమ్‌ను అందిస్తోంది. ఒక పక్క వేసవి, మరో పక్క అధిక ఉష్ణోగ్రతలు ఉండడంతో..

Golden Ice Cream: స్పెషల్ ఫ్లేవర్స్‌తో ‘బంగారపు ఐస్‌క్రీమ్’.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. వైరల్ వీడియో..
Golden Ice Cream
Follow us

|

Updated on: May 11, 2023 | 8:41 PM

Golden Ice Cream: దేశంలోని ప్రముఖ నగరాలలో ఒకటైన సూరత్ నగరంలోని ప్రజలు ఇప్పుడు ఏకంగా బంగారాన్ని తింటున్నారు. అవును, సూరత్‌ నగరం ఆహార ప్రీయుల కోసం 24 క్యారెట్ల బంగారు పూతతో కూడిన ఐస్‌క్రీమ్‌ను అందిస్తోంది. ఒక పక్క వేసవి, మరో పక్క అధిక ఉష్ణోగ్రతలు ఉండడంతో ప్రజలంతా ఐస్ బాల్స్, ఐస్‌డిష్‌, కూల్ డ్రింక్స్ వంటి చల్లని వస్తువులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే సూరత్‌లోని పలు రెస్టారెంట్స్‌ 24 క్యారెట్ల బంగారు పూతతో ఉన్న ఐస్‌క్రీమ్స్ విక్రయిస్తున్నారు.

అయితే ఈ ఐస్‌క్రీమ్‌‌లో బంగారం మాత్రమే ప్రత్యేకం కాదు, దాని ఫ్లేవర్ కూడా ప్రత్యేకమే. ఇందులో సాధారణ ఐస్ క్రీం లేదా ఫ్లేవర్‌ ఉండదు. బంగారు ఐస్‌క్రీమ్‌లో ప్రత్యేకమైన ఫ్లేవర్స్‌ని కలుపుతున్నారు. కస్టమర్ల కోసం ఈ ఐస్‌క్రీమ్ కోన్, ఐస్ బాల్స్ రూపంలో అలంకరించబడి అందుబాటులో ఉంది. ఈ ఐస్‌క్రీమ్ చూడడానికి ఆకర్షణీయంగా, తినడానికి ఎంతో రుచిగా ఉండడంతో ధర ఎక్కువగా ఉన్నా కూడా కస్టమర్లు వద్దనుకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇక దీని ధర 18% GST తో సహా 1000 రూపాయలుగా ఉంది. అలాగే వేసవిలో ఐస్‌క్రీమ్ డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ బంగారం ఐస్ క్రీమ్‌ని తినేందుకు చాలా దూరం నుంచి కూడా ప్రజలు వస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, 1000 రూపాయల ఈ బంగారు ఐస్‌క్రీమ్ లోపల లడ్డూలు, చాలా డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ సిరప్ వెగెరె, ఫ్లేవర్‌లు ఉన్నాయని ఐస్‌క్రీం విక్రేత డాక్టర్ పినాక్ జాదవ్ తెలియజేశారు. ఇంకా ఈ ఐస్ క్రీం తినడానికి అలాగే తయారీ విధానాన్ని చూసేంకుకు కూడా జనాలు వస్తున్నారని, ఇలా చూడటం కూడా ఒక విభిన్నమైన అనుభవమని చెప్పుకొచ్చారు. తయారు చేస్తున్న ఐస్‌క్రీమ్‌ను చూసేందుకే ప్రత్యేకంగా జనం వస్తున్నారని, దూర ప్రాంతాల నుంచి కూడా జనాలు రావడంతో దీని డిమాండ్ ఎక్కువగా ఉందని జాదవ్ అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..