Viral Video: ఏనుగు ముందు పిచ్చి వేషాలు.. అదృష్టంకొద్దీ బతికిపోయాడు.. దడపుట్టిస్తోన్న వీడియో
అటవీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు వాహనదారులకు వన్యమృగాలు తారసపడుతుంటాయి. వాహనదారులు ముందే గమనించి ఆగిపోతే వాటి దారిన అవి వెళ్లిపోతాయి. కాదని పిచ్చి వేషాలు వేస్తే చుక్కలు చూపిస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో..
అటవీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు వాహనదారులకు వన్యమృగాలు తారసపడుతుంటాయి. వాహనదారులు ముందే గమనించి ఆగిపోతే వాటి దారిన అవి వెళ్లిపోతాయి. కాదని పిచ్చి వేషాలు వేస్తే చుక్కలు చూపిస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. ధర్మపురిలో హోగెనెక్కల్ ఫారెస్ట్ ఏరియాలో ఓ ఏనుగు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ ఒకవైపున ఆగిపోయింది. వాహనాలు రద్దీగా తిరుగుతున్నాయి. దాంతో కాలు దువ్వుతూ, ఘీంకరిస్తూ వాహనాల రద్దీ తగ్గేవరకూ చూస్తోంది. అది చూసి కొందరు కార్లు, బైకులను ఆపేశారు. బస్సులు మాత్రం వెళ్తున్నాయి.
ఇంతలో మద్యం సేవించిన ఓ వ్యక్తి ఏనుగు వద్దకు వెళ్లి, దానికి దణ్ణం పెడుతూ రకరాలుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ ఏనుగు చాలా కోపంగా ఉంది. అక్కడున్న వాళ్లు అతన్ని వెనక్కి రమ్మని పిలిచినా అతను వినకుండా ఏనుగు ఎదురుగా నిలుచుని చేతులెత్తి పోజులిచ్చాడు. ఈ సమయంలో ఏనుగు ఘీంకరిస్తూ అతడిపైకి దూసుకొచ్చినంత పని చేసింది. అయితే, ఏమనుకుందో మరు క్షణంలో వెనక్కి తగ్గింది. అతడు మాత్రం తాపీగా అక్కడి నుంచి వచ్చేశాడు.
It was suicidal, even then the gentle giant tolerated the man and let him go.
Via: @Saket_Badola pic.twitter.com/27F6QHstkn
— Ramesh Pandey (@rameshpandeyifs) May 11, 2023
దీనికి సంబంధించిన వీడియోను ‘ఏనుగు సహనంతో వ్యవహరించి.. అతన్ని వదిలిపెట్టింది’ అనే క్యాప్షన్‌తో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రమేశ్ పాండే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు వేలల్లో వీక్షణలు, లైకులు, కామెంట్లు రావడంతో నెట్టింట వైరల్ అయ్యింది. కొందరు నెటిజన్లు మాత్రం సదరు వ్యక్తి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఏనుగు రెండు సార్లు హెచ్చరించి వదిలేసింది.. అదృష్టవంతుడు వార్నింగ్ ఇచ్చి వదిలేసిందంటూ కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.