‘జూన్ 2న సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కాంగ్రెస్ ఘన సత్కారం.. ఎన్నికల్లో గెలిస్తే కోటి నగదు బహుమతి’

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ క్విజ్ కాంపిటీషన్ శుక్రవారం (మే 12) బోయిన్ పల్లిలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

'జూన్ 2న సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కాంగ్రెస్ ఘన సత్కారం.. ఎన్నికల్లో గెలిస్తే కోటి నగదు బహుమతి'
Revanth Reddy With Rahul Sipligunj
Follow us

|

Updated on: May 12, 2023 | 6:20 PM

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ క్విజ్ కాంపిటీషన్ శుక్రవారం (మే 12) బోయిన్ పల్లిలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేద కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అందుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ఆస్కార్ స్థాయికి ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఘరంగా సన్మానిస్తుందని తాము భావించామన్నారు. కానీ కేసీఆర్ సర్కార్ ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ విస్మరించినా.. రాహుల్ సిప్లిగంజ్‌ను తాము గౌరవిస్తామని మాట ఇచ్చారు. కళాకారులను సన్మానించవల్సిన అవసరం ఎంతైన ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

జూన్ 2న రాహుల్ సిప్లిగంజ్‌కు భారీ సన్మానం ఏర్పాటు చేయడంతోపాటు రూ.10 లక్షల నగదు బహుమతి కూడా అందిస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక కోటి రూపాయల నగదు బహుమతి అందిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఆర్ఆర్ఆర్ మువీలోని నాటు నాటు పాటకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (ఉత్తమ పాట) విభాగంలో ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, తొలి భారతీయ సినిమా పాటగా చరిత్ర సృష్టించింది. ఈ పాటకు గేయ రచయిత చంద్రబోస్‌ సాహిత్యం అందించగా ఎమ్‌.ఎమ్‌ కీరవాణి స్వరపరిచారు. కాల భైరవ, రాహుల్‌ సిప్లీగంజ్‌ ఆలపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023