Puri Jagannath: పూరీ పంజా విసరడం పక్కా..? సెన్సేషనల్ డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్స్‌పై ఆసక్తికర విషయాలు..
పూరీ జగన్నాథ్.. ఇది పేరు కాదు.. తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్. పడిన ప్రతీసారి లేవడం కాదు.. లేచి పరిగెడుతుంటారు ఈ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్. లైగర్ కాదు.. దాన్ని మించిన ఫ్లాపులే కెరీర్‌లో ఎన్నో చూసారు పూరీ.

పూరీ జగన్నాథ్.. ఇది పేరు కాదు.. తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్. పడిన ప్రతీసారి లేవడం కాదు.. లేచి పరిగెడుతుంటారు ఈ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్. లైగర్ కాదు.. దాన్ని మించిన ఫ్లాపులే కెరీర్‌లో ఎన్నో చూసారు పూరీ. కానీ పాన్ ఇండియా ప్రభావమో ఏమో కానీ లైగర్ మూవీ పూరీ జగన్నాథ్ కెరీర్‌పై దారుణమైన ప్రభావం చూపించింది. అందుకే అదొచ్చి ఇన్ని నెలలైనా.. పూరీ నెక్ట్స్ సినిమా ఏంటో అప్ డేట్ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది.
లైగర్ డిజాస్టర్ అని అర్థంకావడానికి పూరీ జగన్నాథ్‌కి ఎంతో టైమ్ పట్టలేదు. అందుకే ఆ ఎఫెక్ట్ జనగణమన మూవీపై పడింది. మొదలైన షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దాని తర్వాత చిరంజీవికి కథ చెప్పారని ఓ సారి.. బాలయ్య కొత్త ప్రాజెక్టుకు రెడీగా ఉన్నారని మరోసారి.. సల్మాన్ ఖాన్‌కు కథ చెప్పి ఒప్పించే పనిలో ఉన్నారని ఇంకోసారి.. ఇలా పూరీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై రోజుకో వార్త వచ్చింది. కానీ దేనిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు.దీంతో పూరీ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. అయితే కాస్త లేటైనా పూరీ పంజా విసరడం పక్కా అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తంచేస్తున్నారు.
చిరంజీవికి నిజంగానే కథ చెప్పారు పూరీ జగన్నాథ్. ఈ ఇద్దరి కాంబినేషన్ ఇప్పటికీ లైన్‌లోనే ఉంది. కాకపోతే కాస్త టైమ్ పట్టేలా ఉంది. మరోవైపు బాలయ్య కథ కూడా ఓకే అయినా.. ఆయన ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో పూరీకి డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఈ లోపు రామ్‌తో నెక్ట్స్ సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు పూరీ. మే 15న రామ్ పుట్టిన రోజు సందర్బంగా అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలున్నాయి.




ఇస్మార్ట్ శంకర్‌తో ఈ కాంబినేషన్‌లో సాలిడ్ బ్లాక్‌బస్టర్ వచ్చింది. తాజాగా దీనికి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు పూరీ. అది కూడా తన పూరీ కనెక్ట్స్‌లోనే చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు డబుల్ ఇస్మార్ట్ టైటిల్ పరిశీలనలో ఉంది. మరోవైపు మే 15న బోయపాటితో రామ్ చేస్తున్న చిత్ర ఫస్ట్ లుక్ కూడా విడుదల కానుంది. మొత్తానికి మరి చూడాలిక.. పూరీ, రామ్ కాంబో ఈ సారి ఏం మ్యాజిక్ చేయబోతున్నారో..?
మరిన్ని సినిమా వార్తలు చదవండి..