Liger Movie: లైగర్ నైజాం ఎగ్జిబిటర్ల ఆందోళనపై స్పందించిన ఛార్మి.. ఏమన్నారంటే..
లైగర్ సినిమాతో భారీగా నష్టపోయామని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. లైగర్ సినిమాపై పూరీ జగన్నాథ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేలా జోక్యం చేసుకోవాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు.

లైగర్ సినిమా నైజాం ఏరియా ఎగ్జిబిటర్ల ఆందోళనపై ఈ సినిమా కో ప్రొడ్యూసర్, నటి ఛార్మి స్పందించారు. ఫిలించాంబర్ పంపిన మెయిల్ కు రిప్లై ఇచ్చారు. నైజాం ఏరియా ఎగ్జిబర్లకు త్వరలోనే న్యాయం చేస్తామని చెప్పారు ఛార్మి. తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకుంటామని చెప్పి.. ఆరునెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదంటూ నైజాం ఏరియా ఎగ్జిబిటర్లు హైదరాబాద్ లోని ఫిల్మ్‌చాంబర్ ఎదుట ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. లైగర్ సినిమాతో భారీగా నష్టపోయామని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. లైగర్ సినిమాపై పూరీ జగన్నాథ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేలా జోక్యం చేసుకోవాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు.
గతంలో పూరీ జగన్నాథ్ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు ఎగ్జిబిటర్లు. ఆ సమయంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పూరీ. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఇవ్వాల్సిన ఓవర్ ఫ్లో డబ్బులు ఇవ్వలేదన్నారు. ఆ సమయంలో ఇదే ఇష్యూకు సంబంధించి పూరికి సంబంధించి ఓ వాయిస్ లీకయ్యింది. తాను డబ్బులు తిరిగి ఇవ్వవలసిన అవసరం లేకపోయినా బయ్యర్లు నష్టపోయారని తిరిగి ఇవ్వడానికి అంగీకరించానని, ఒక నెలలో ఇస్తానని చెప్పినా.. అతి చేసి ధర్మా చేస్తానంటూ తనను బెదిరించారని పూరి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈ ఇష్యూ సెటిల్ అయిందనే అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు లైగర్ సినిమా నైజాం ఏరియా ఎగ్జిబిటర్ల ఆందోళనతో మరోసారి లైగర్ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ధర్నా చేసిన వాళ్లకు కాకుండా నష్టపోయిన వాళ్ల డబ్బు ఇస్తానన్న హామీని పూరీ నిలబెట్టుకోవాలన్నారు ఎగ్జిబిటర్లు.




ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ పూరి లైగర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లె ధర్మా ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా ప్లాపు కావడంతో పూరికి తీవ్ర నష్టాలను మిగిల్చింది.