Suman: హీరో సుమన్ కూతురిని చూశారా ?… అందమే అసూయ పడేలా ఉంది.. త్వరలోనే పెళ్లి !..

కేవలం హీరోగానే కాకుండా.. అనేక చిత్రాల్లో సహాయ నటుడిగానూ కనిపించారు. అక్కినేని నాగార్జున, డైరెక్టర్ రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ జీవించేశారు. దాదాపు 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.

Suman: హీరో సుమన్ కూతురిని చూశారా ?... అందమే అసూయ పడేలా ఉంది.. త్వరలోనే పెళ్లి !..
Suman
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 6:50 PM

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటుడు సుమన్ సుపరిచితమే. 1977లో తమిళ్ సినిమా నీచల్ కులం మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. హీరోగా తొలి సినిమా పోలీసు అధికారి. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ భాషలలో కలిపి మొత్తం 150కి పైగా సినిమాల్లో నటించారు. కేవలం హీరోగానే కాకుండా.. అనేక చిత్రాల్లో సహాయ నటుడిగానూ కనిపించారు. అక్కినేని నాగార్జున, డైరెక్టర్ రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ జీవించేశారు. దాదాపు 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు సుమన్.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సుమన్ తన కుమార్తె గురించి ప్రస్తావన రాగా.. ఆమె పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తె అఖిలజా ప్రత్యూష గోల్డ్ మెడలిస్ట్ అని.. ప్రస్తుతానికి తనకు నటనపై ఆసక్తి లేదని అన్నారు. రెండేళ్ల క్రితం మణిపాల్ యూనివర్సిటీలో హ్యూమన్ జెనెటిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించిందని తెలిపారు. గత కొంతకాలంగా తన కుమార్తె పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు సుమన్.

సౌత్ ఇండియాలోని ఓ స్టార్ ఇంటికి కోడలిగా తన కుమార్తె వెళ్తుందన్న వార్తలలో నిజం లేదని.. ఆమెకు పెళ్లి చేయాలనే ఆలోచన ఉందని.. కానీ ఇప్పటికీ వివాహం గురించి పూర్తి స్థాయిలో ఆలోచన లేదని అన్నారు. ప్రస్తుతం తన చదువు పూర్తై సెటిల్ అయ్యాకే పెళ్లి గురించి ఆలోచిస్తామని అన్నారు. అలాగే తాను జైలుకు ఎందుకు వెళ్లానో అందరికీ తెలుసునని.. ఆ కేసులో ప్రమేయం లేకపోయినా అరెస్ట్ చేశారని. ఆసమయంలో తనకు సుహాసిని, సుమలత మద్దతుగా నిలిచారని అన్నారు.

ఇవి కూడా చదవండి
Akilaja Prathyusha

Akilaja Prathyusha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.