Tollywood: నవ్వుతోనే కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేస్తోన్న హీరోయిన్.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టండి..
అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తుంది.

పైన ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి. సౌత్ సినీ ప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. తొలి సినిమాతోనే ఆడియన్స్ హృదయాలను దొచుకుంది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన సినిమా చుట్టూ కాంట్రావర్సీ ఉన్నప్పటికీ.. ఆ చిత్రానికి మాత్రం భారీ రెస్పాన్స్ రావడమే కాదు.. ఎక్కువగానే వసూళ్లు రాబడుతుంది. ఎవరో గుర్తుపట్టారా ? .. తనే హార్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మ.
అదా శర్మ.. 2008లో హిందీ హార్రర్ ఫిల్మ్ 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా.. అదా శర్మ నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత హిందీలోనే 2014లో హసే తో పసే సినిమాలో నటించింది. అదే ఏడాదిలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ అదాకు మాత్రం అవకాశాలు వచ్చాయి.




మెయిన్ హీరోయిన్గా కాకుండా.. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. తెలుగుతోపాటు.. కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె ది కేరళ స్టోరీ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కేరళతోపాటు..బెంగాల్ లో ఈ సినిమాను ఏకంగా నిషేదించారు. ఓవైపు వరుస వివాదాలు చుట్టుముట్టిన భారీగానే వసూళ్లు రాబడుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.