- Telugu News Photo Gallery Cinema photos Actress Parineeti Chopra and Raghav Chadha got engaged; Pics goes viral on socail media
Parineeti Chopra Engaged: బాలీవుడ్ నటి పరిణీతి-రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఫొటోలు చూశారా..? వైరల్ అవుతోన్న పిక్స్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పాకానడింది. చివరి నిముషం వరకూ తమ రిలేషన్‌షిప్‌ను రహస్యంగా ఉంచిన ఈ జంట సోషల్ మీడియా వేదికగా తమ నిశ్చితార్ధం గురించి అధికారికంగా ప్రకటించారు. .
Updated on: May 14, 2023 | 6:59 AM

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పాకానడింది. చివరి నిముషం వరకూ తమ రిలేషన్‌షిప్‌ను రహస్యంగా ఉంచిన ఈ జంట సోషల్ మీడియా వేదికగా తమ నిశ్చితార్ధం గురించి అధికారికంగా ప్రకటించారు.

పరిణీతి, రాఘవ్ చద్దాల నిశ్చితార్ధ వేడుక కుటుంబసభ్యులు, రాజకీయ నాయకులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శనివారం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఈ వేడుక జరిగింది.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ రాఘవ్, పరిణీతి తమ ఇన్‌స్టాగ్రాం పేజీల్లో కొన్ని ఫొటోలను పోస్టు చేశారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కాంగ్రెస్ నేత పి చిదంబరం, నటి ప్రియాంక చోప్రా సహా 150 మంది అతిథులు హాజరయ్యారు.

వీరి నిశ్చితార్ధానికి ముందు పరిణీతి ఇల్లు లైటింగ్‌తో ముస్తాబు చేయడం ద్వారా హింట్ ఇచ్చిన ఈ జంట ఆ తర్వాత శుభవార్త తెలిపారు. త్వరలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టిట వైరల్ అవుతున్నాయి.





























