AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadipurush: రిలీజైన అన్ని భాషల్లో ఆదిపురుష్ ట్రైలర్ హిట్..ప్రపంచంలోనే ఒకే ఒక్క హీరోగా ప్రభాస్ కొత్త రికార్డ్ సృష్టి..

బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్‌ టెక్నాలిజీతో రామాయణం నేపథ్యంలో 

Aadipurush: రిలీజైన అన్ని భాషల్లో ఆదిపురుష్ ట్రైలర్ హిట్..ప్రపంచంలోనే ఒకే ఒక్క హీరోగా ప్రభాస్ కొత్త రికార్డ్ సృష్టి..
Adipurush
Surya Kala
|

Updated on: May 14, 2023 | 10:47 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్ నుంచి ప్రతి విషయంలోనూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. రామయ్యగా ప్రభాస్ నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ కాంట్రవర్సియల్ ఫిల్మ్ గా ట్యాగ్ ను సొంతం చేసుకున్నదని చెప్పవచ్చు. రామాయణం కథాంశంతో వస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దీంతో ఇప్పుడు ప్రభాస్ సంచలన రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్‌లో దూసుకుపోతోంది. మొత్తంగాకూడా.. 100 మిలియన్‌ రికార్డ్ కూడా కొట్టేసింది.

అవును బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్‌ టెక్నాలిజీతో రామాయణం నేపథ్యంలో  తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్‌ అయి అందర్నీ తెగ ఆకట్టుకుంది. వాల్మీకి రామాయణంలోని రాముని కథనే.. సరికొత్తగా.. విజువల్ వండర్‌గా చూపిస్తున్నారనే టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక ఈ మూవీ ట్రైలర్ తాజాగా 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ..బాషల్లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అన్ని భాషల్లో వచ్చిన వ్యూస్‌ కలుపుకుని 100 మిలియన్ వ్యూస్ చేరుకుంది. ఈ ఫీట్ తో.. మరో సారి ప్రభాస్ క్రేజ్ అండ్ రేంజ్‌ ఏంటో అందరికీ తెలిసేలా చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్ గానే ఆదిపురుష్ ట్రైలర్ కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

ఆదిపురుష’ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకునేలా మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో దీన్ని కట్ చేశారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..