Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hema Malini on Bunny: డ్రీమ్ గర్ల్ మనసుదోచేసిన బన్నీ.. బాలీవుడ్ హీరోలకంటే బెస్ట్ అంటూ ప్రశంసలు

పుష్ప సినిమా హిందీలో కూడా రిలీజై..నార్త్ ఇండియాలో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపొయింది. ఇటీవల హేమమాలిని చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. 

Hema Malini on Bunny: డ్రీమ్ గర్ల్ మనసుదోచేసిన బన్నీ.. బాలీవుడ్ హీరోలకంటే బెస్ట్ అంటూ ప్రశంసలు
Hema Malini On Bunny
Follow us
Surya Kala

|

Updated on: May 13, 2023 | 9:04 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తన అద్భుతమైన నటనతో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు.  పాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్. అల వైకుంఠపురములో, DJ: దువ్వాడ జగన్నాధం, పుష్ప: ది రైజ్ వరస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు. ముఖ్యంగా పుష్ప సినిమా హిందీలో కూడా రిలీజై..నార్త్ ఇండియాలో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపొయింది. ఇటీవల హేమమాలిని చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

ఇటీవల తాను పుష్ప మూవీ చూశానని.. అల్లు అర్జున్ మేకోవర్..  డ్యాన్స్ తనకు ఎంతగానో నచ్చాయని హేమ మాలిని చెప్పారు. అంతేకాదు పుష్ప కోసం అల్లు అర్జున్ తనను తాను ఎంతగానో మార్చుకున్నాడని.. ఇలా ఎప్పటికీ బాలీవుడ్ హీరోలు చెయ్యరని సంచలన కామెంట్స్ చేశారు. ఈ సినిమా సాంగ్స్ లో అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ ను తాను కూడా ఇష్టంగా ఇమిటేట్ చేశానని చెప్పారు.

అల్లు అర్జున్ నటించిన మరో సినిమా కూడా చూశానని.. అది కుడా బాగుందని.. ఎంతో అందంగా కనిపించాడని చెప్పింది హేమ మాలిని. అలాంటి బన్నీ పుష్ప సినిమా కోసం రఫ్ లుక్ ను, లుంగి కట్టుకుని నటించాడు.. ఇలాంటి క్యారెక్టర్ లో బాలీవుడ్ హీరో అయితే నటించరు.. రఫ్ లుక్, రోల్ పోషించడానికి బన్నీ ఒప్పుకోవడం నిజంగా అభినందనీయన్నారు హేమమాలిని.

ఇవి కూడా చదవండి

హిందీ సినిమాల హీరోలు అలాంటి క్యారెక్టర్ లో నటించలేరు.. రజియా సుల్తాన్ సినిమా కోసం ధర్మేంద్ర కాస్త నల్లగా కనిపించాలంటే చాలా ఆలోచించారని హేమ మాలిని అప్పటి విశేషాలను గుర్తు చేసుకున్నారు.

పుష్పతో అల్లు అర్జున్ నార్త్ లో కూడా భారీ ఫాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే అల్లు అర్జున్నా గతంలో నటించిన సినిమాలు కూడా హిందీలో డబ్ అయి ఆకట్టుకున్నాయి. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డ్యాన్స్ కు, నటనకు . సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫ్యాన్స్ అయ్యారు.  ఇప్పుడు సాక్షాత్తూ హేమా మాలినిలాంటి నటే బన్నీ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?