- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actress Jacqueline Fernandez shares pics from KKR vs RR IPL clash at Eden Gardens goes viral
Jacqueline Fernandez: ఐపీఎల్ మ్యాచ్‌లో సందడి చేసిన జాక్వెలిన్.. ఇంకోసారి రావొద్దంటూ కేకేఆర్ ఫ్యాన్స్ వార్నింగ్
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ తరచూ విచారణకు హాజరవుతోంది. యితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని జాక్వెలిన్ గురువారం ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన KKR వర్సెస్ RR మ్యాచ్‌కు హాజరైంది.
Updated on: May 13, 2023 | 9:23 AM

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ తరచూ విచారణకు హాజరవుతోంది.

అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని జాక్వెలిన్ గురువారం ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన KKR వర్సెస్ RR మ్యాచ్‌కు హాజరైంది. కోల్‌కతా జెండా పట్టుకుని ఆటగాళ్లను ఎంకరేజ్ చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోయింది.

ఇదంతా బాగానే ఉంది కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఫుల్ జోష్‌లో, ఎంతో హ్యాపీగా కనిపించింది జాక్వెలిన్. ఇది కేకేఆర్ అభిమానులకు కోపం తెప్పించింది.

కోల్‌కతాను ఓడించేందుకే జాక్వెలిన్ ఈడెన్ గార్డెన్‌కు వచ్చిందని పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నాను. దయచేసి ఇంకోసారి స్టేడియానికి రావొద్దంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవలే సెల్ఫీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది జాక్వెలిన్. ప్రస్తుతం ఆమె క్రాక్, ఫతేహా మూవీస్‌లో నటిస్తోంది.





























