Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిస్ వరల్డ్ గెలుచుకున్న టైంలో నిక్ వయసు 7 ఏళ్లు.. మాది విధి కలిపిన జంట అంటున్న ప్రియాంక చోప్రా

మూవీ ప్రమోషన్ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక తన గురించి తన భర్త నిక్ గురించి అనేక విషయాలను పంచుకుంది. పెళ్లి అయిన తర్వాత తన అత్తగారు మిస్ వరల్డ్ పోటీ సమయంలో జరిగిన ఓ విషయం చెప్పారని.. వెల్లడించింది ప్రియాంక.

మిస్ వరల్డ్ గెలుచుకున్న టైంలో నిక్ వయసు 7 ఏళ్లు.. మాది విధి కలిపిన జంట అంటున్న ప్రియాంక చోప్రా
Priyanka Nick
Follow us
Surya Kala

|

Updated on: May 12, 2023 | 9:01 AM

ప్రియాంక చోప్రా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. మిస్ వరల్డ్ టైటిల్ ను గెలుచుకుని మోడలింగ్ నుంచి నటిగా బాలీవుడ్ లో అడుగు పెట్టి..ఇప్పుడు హాలీవుడ్ లో స్థిరపడిన నటి. ప్రస్తుతం  ప్రియాంక చోప్రా లవ్ ఎగైన్ చిత్రం ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం ప్రమోషన్  సమయంలో  ప్రియాంక అనేక విషయాలపై మాట్లాడుతూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా  ప్రియాంక చేసిన కొత్త ప్రకటనపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో మరోసారి ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ మధ్య ఏజ్ గ్యాప్ పై అందరి దృష్టిలో పడింది.

మూవీ ప్రమోషన్ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక తన గురించి తన భర్త నిక్ గురించి అనేక విషయాలను పంచుకుంది. పెళ్లి అయిన తర్వాత తన అత్తగారు మిస్ వరల్డ్ పోటీ సమయంలో జరిగిన ఓ విషయం చెప్పారని.. వెల్లడించింది ప్రియాంక. మిస్ వరల్డ్ ని గెలుచుకున్న సమయంలో ప్రియాంక వయసు 18 సంవత్సరాలు. 2000 సంవత్సరం నవంబర్‌లో లండన్‌లో జరిగింది. అప్పుడు జూలైలో ప్రియాంకకు 18 ఏళ్లు వచ్చాయి. అప్పుడు తనకు ఏమి చేయాలో కూడా తెలియదు.. నేను చిన్నపిల్లను.. ఎవరు ఏమి అనుకుంటారో కూడా ఆలోచించేదానిని కాదని చెప్పారు ప్రియాంక.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

2000 సంవత్సరంలో లండన్‌లో జరిగిన  పోటీలను మా అత్తగారు.. మామయ్య చూసారని.. అప్పుడు తన అత్తగారు తనను బాగా గుర్తుంచుకున్నారని ప్రియాంక తెలిపింది. ఆ సమయంలో నిక్ తండ్రికి అందాల పోటీలు చూడటం అంటే ఇష్టం. ప్రియాంక అందాల పోటీలో విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకున్న సమయంలో  తన తండ్రి, తల్లితో పాటు నిక్ జోనాస్ టీవీ సెట్ ముందు కూర్చుని ఉన్నాడు. ప్రియాంక గెలవడాన్ని నిక్ చూశాడు. మాది విధి కలిపిన బంధం అని గుర్తు చేసుకున్నారు ప్రియాంక.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

ప్రియాంకకు అప్పుడు 17 ఏళ్లు, నిక్ జోనాస్ వయసు 7 ఏళ్లు. నిక్ , ప్రియాంక  దంపతులకు ఒక కుమార్తె. వీరిద్దరూ తమ పెళ్లి గురించి ఎప్పుడూ చర్చించుకుంటూనే ఉంటారు. నిక్, ప్రియాంక ల ఏజ్  గ్యాప్ ఎల్లప్పుడూ చర్చలో భాగంగా ఉంటుంది. ఈ ప్రియాంక కంటే నిక్ 10 ఏళ్ళు చిన్నవాడు. ఎవరు ఏమి అన్నా.. సరదాగా తీసుకుంటారు.. వ్యక్తి గత జీవితాన్ని, వృత్తిని చక్కగా మేనేజ్ చేస్తూ.. హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు నిక్ , ప్రియాంకలు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..