Adipurush: మళ్ళీ వివాదంలో ప్రభాస్ ఆదిపురుష్.. మేకర్స్ తీరుకి వ్యతిరేకంగా సెన్సార్ బోర్డ్ మెంబర్ కోర్టులో ఫిర్యాదు

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్. మోషన్ క్యాప్చర్‌ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. టీజర్‌ రిలీజ్‌ నుంచే ఎన్నో వివాదాలకు కేరాఫ్‌ గా మారింది.

Adipurush: మళ్ళీ వివాదంలో ప్రభాస్ ఆదిపురుష్..  మేకర్స్ తీరుకి వ్యతిరేకంగా సెన్సార్ బోర్డ్ మెంబర్ కోర్టులో ఫిర్యాదు
Adipurush
Follow us
Surya Kala

|

Updated on: May 13, 2023 | 8:25 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ‘ఆదిపురుష్‌’ పోస్టర్ రిలీజ్ దగ్గరనుంచి దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది ఆదిపురుష్. ఇప్పటికే ఒక రిలీజ్.. మూడు వివాదాలు అన్నచందంగా సాగుతోంది ఆదిపురుష్ ప్రయాణం.. తాజాగా మరో వివాదంలో చిక్కుంది. సెన్సార్ బోర్డ్ మెంబరే ఈ మూవీ మేకర్స్ తీరుకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు మెట్లక్కడం ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేసింది. బాలీవుడ్‌లో ఇదే బిగ్ టాపిక్‌ గా మారింది.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్. మోషన్ క్యాప్చర్‌ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. టీజర్‌ రిలీజ్‌ నుంచే ఎన్నో వివాదాలకు కేరాఫ్‌ గా మారింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా హిందుత్వ సంఘాలను గొంతులేపేలా చేసింది. అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో అవన్నీ.. కనిపించకుండా.. వినిపించకుండా పోయిన వేళ.. సెన్సార్ బోర్డ్ లో సనాతన్ ధర్మ ప్రచారకర్త సంజయ్‌ దీనానాథ్‌.. ఈసినిమాకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు కెళ్లారు.

సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ కాకముందే.. మేకర్స్ ఈ సినిమా స్క్రీనింగ్ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టిన ఈయన .. బాంబే హైకోర్ట్‌ న్యాయవాదులైన ఆవిష్ రాయ్‌, పంకజ్‌ మిశ్రాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా విషయంలో ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే.. వివాదాలు.. విమర్శలు రాకుండా ఉండాలంటే.. సెంట్రల్‌ బోర్డ్ సర్టిఫికేషన్ తర్వాతే ఈ మూవీని స్క్రీనింగ్ చేయాలని .. ఆమేరకు మేకర్స్ ను ఆదేశించాలని సంజయ్‌ తన పిటిషన్లో కోరారు.

ఇవి కూడా చదవండి

దక్షిణాది సూపర్‌స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ జంటగా నటిస్తున్న ‘ఆదిపురుష్’లో అన్నీ తప్పులే అని.. నెటిజన్లు ట్రోల్స్  చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను కూడా బాయ్‌కాట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ప్రభాస్ రాముడిగా సీత పాత్రలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ కృతి సనన్‌ నటిస్తోండగా.. రావణ్ పాత్రలో సైఫ్అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడి పాత్రలో దేవదత్‌ నటిస్తున్నారు. జూన్ 16, 2023న థియేటర్లలోకి రానుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?