Recruitment scam: హైకోర్టు షాకింగ్‌ తీర్పు.. 36 వేల టీచర్ల నియమకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు

ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 2016లో రిక్రూట్ అయిన 36,000 మంది అభ్యర్థుల నియామకాన్ని రద్దు చేస్తూ శుక్రవారం (మే 12) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయతో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం 17 పేజీల తీర్పును వెలువరించారు. ఈ స్థాయి అవినీతిని తానెన్నడూ చూడలేదని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు..

Recruitment scam: హైకోర్టు షాకింగ్‌ తీర్పు.. 36 వేల టీచర్ల నియమకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు
West Bengal Teacher Recruitment Scam
Follow us
Srilakshmi C

|

Updated on: May 14, 2023 | 10:00 AM

పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 2016లో రిక్రూట్ అయిన 36,000 మంది అభ్యర్థుల నియామకాన్ని రద్దు చేస్తూ శుక్రవారం (మే 12) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయతో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం 17 పేజీల తీర్పును వెలువరించారు. ఈ స్థాయి అవినీతిని తానెన్నడూ చూడలేదని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. మూడు నెలల్లోపు కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను ఆదేశించారు. నియామక ప్రక్రియలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండింటినీ నిర్వహించాలని, ఇంటర్వ్యూ ప్రక్రియ మొత్తం వీడియో తీసి భద్రపరచాలని అన్నారు. ఐతే కొత్త అభ్యర్ధులెవరికి ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలకు అనుమతి ఉండ బోదని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ స్పష్టం చేశారు

కాగా 2016లో మొత్తం 42,500 మంది అభ్యర్థులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. అయితే, నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. 2014లోని టెట్ ప్రకారం ట్రైనింగ్​ తీసుకోని వాళ్లను కూడా అపాయింట్ చేశారని, నియామక ప్రక్రియలో సరైన విధానాన్ని అనుసరించలేదని ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు ఎంపికైన వారందరి అపాయింట్​మెంట్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కాగా గతంలో కూడా పలు కేసుల్లో ఫిబ్రవరిలో 1,911 మంది, మార్చిలో 842 మంది అపాయింట్‌మెంట్‌లను కోర్టు రద్దు చేసింది. ఐతే ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను రద్దు చేయడం ఇదే తొలిసారి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.