Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Elections: కర్నాటక ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు.. తెరపైకి 4 పాయింట్ ఫార్ములా

కర్నాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. గ్రాండ్‌ విక్టర్‌ కొట్టిన కర్నాటక కాంగ్రెస్‌ పగ్గాలు ఎవరు చేపట్టనున్నారన్న దానిపై ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. సీఎం ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్‌ కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవిని బీసీలకా..? ఒక్కలిగ వర్గానికా? దళితులకా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది...

Karnataka Elections: కర్నాటక ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు.. తెరపైకి 4 పాయింట్ ఫార్ములా
Karnataka Elections
Follow us
Narender Vaitla

|

Updated on: May 14, 2023 | 9:50 AM

కర్నాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. గ్రాండ్‌ విక్టర్‌ కొట్టిన కర్నాటక కాంగ్రెస్‌ పగ్గాలు ఎవరు చేపట్టనున్నారన్న దానిపై ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. సీఎం ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్‌ కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవిని బీసీలకా..? ఒక్కలిగ వర్గానికా? దళితులకా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఇక ఆదివారం సీఎల్పీ భేటీ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ భేటీలో ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.

ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు డిప్యూటీ సీఎంలకు అవకాశం ఇచ్చే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కర్నాటక కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ 4 పాయింట్ ఫార్ములా అప్లై చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆప్షన్‌ 1గా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేయడం. ఆప్షన్‌ 2గా ఒక్కలిగ వర్గం నుంచి డీకే శివకుమార్‌కి చాన్స్‌ ఇవ్వడం. ఆప్షన్‌ 3గా ఇద్దరూ కాకుంటే ఖర్గేకి సీఎంగా అవకాశం ఇచ్చే అవకాశాలు. ఇక ఆప్షన్‌ 4గా ఖర్గే కూడా తిరస్కరిస్తే పరమేశ్వర్‌కి అవకాశం ఇవ్వనున్నారనే చర్చ జరుగుతోంది.

ఇక సీఎంగా సిద్ధరామయ్య అయితే.. అంటే ఆప్షన్‌ 1 అమలుచేస్తే డిప్యూటీగా డీకే శివకుమార్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. డీకేతోపాటు డిప్యూటీలుగా ఎంబీపాటిల్‌, పరమేశ్వర్‌ ఉండనున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..