Viral: ఇంటిని మరమ్మత్తు చేస్తుండగా కనిపించిన రెండు రంధ్రాలు.. ఏంటని చూడగా మైండ్ బ్లాంక్!
ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కావాలని కలలు కంటారు. ఇక చాలామంది దీన్ని సాకారం చేసుకుంటారు. ఆమె పేరు అంబర్ హాల్(42). సొంతింటి కలను సాకారం చేసుకుంది.

ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కావాలని కలలు కంటారు. ఇక చాలామంది దీన్ని సాకారం చేసుకుంటారు. ఆమె పేరు అంబర్ హాల్(42). సొంతింటి కలను సాకారం చేసుకుంది. తాను ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని తన అభిరుచికి తగ్గట్టుగా మార్చుకునేందుకు మొదటిసారిగా అక్కడికి వెళ్ళింది. అయితే అక్కడ కనిపించిన దృశ్యానికి ఆమె ఒక్కసారిగా బెంబేలెత్తిపోయింది. ఇంట్లోని ఊహించని అతిధులు ఆమెకు స్వాగతం పలకడంతో దెబ్బకు షాక్ అయింది. ఈ ఘటన కొలరాడోలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
కొలరాడో నివాసి అయిన 42 ఏళ్ల అంబర్ హాల్ తన కొత్త ఇంటిని ఒక్కసారి తిరిగి రావడానికి పెంపుడు కుక్కను తీసుకుని వెళ్లింది. అక్కడ ఆమె డాగీ గోడ కేసి చూస్తూ ఉండిపోవడంతో.. ఏదైనా సాలీడును చూసి ఉండొచ్చునేమో అని అనుకుని.. తన పనిలో తాను నిమగ్నమైంది. ఎంతసేపైనా ఆ కుక్క అలానే గోడను చూస్తుండటంతో.. అక్కడ ఏముందోనని చూడటానికి వెళ్లగా.. అంబర్‌కు రెండు రంద్రాలు కనిపించాయి. చూస్తుండగానే వాటిల్లో నుంచి పాములు గోడలపైకి పాకడం చూశాను. దెబ్బకు భయపడిపోయానని తెలిపింది. గోడ పగుళ్లలో కుప్పలుగా పాములు చుట్టచుట్టుకుని ఉన్నట్లు గమనించాను. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు 10కి పైగా పాములు కనిపించాయని చెప్పారు. ఇవి గార్టెర్ స్నేక్స్ అని నిపుణులు అంటున్నారు. వారంతా కూడా ఇంత పొడవైన గార్టెర్ స్నేక్‌ను ఇంతకు ముందెన్నడూ చూడలేదని కూడా చెబుతున్నారు.
పాములు ఈ నేల కింద పాములు తమ ఆవాసాన్ని ఏర్పరచుకుని ఉండవచ్చని స్నేక్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడ్డారు. వాటి పరిణామాన్ని చూస్తే సుమారు రెండు లేదా మూడేళ్లుగా ఇక్కడే ఉంటున్నట్లు అనిపిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితిలో, ఇల్లంతా పూర్తిగా శుభ్రపరచడం జరగని వరకు, అవి బయటకు వస్తూ ఉంటాయి. ఇంట్లో నుంచి పాము బయటకు రావడంతో అంబర్ భయాందోళనకు గురవుతున్నారు. కొత్త ఇంట్లోకి భద్రంగా ఉండే వరకు అడుగుపెట్టనని చెప్పింది. పాములను తొలగించడానికి అంబర్ పాము పట్టే వ్యక్తిని నియమించుకున్నారని.. ఇప్పటివరకు వెయ్యి డాలర్లు ఖర్చు చేసింది. (Source)