Video: లిటిల్ మాస్టర్ గుండెలపై ధోనీ సంతకం.. అరుదైన ఆటోగ్రాఫ్ అంటూ ఫ్యాన్స్ భావోద్వేగం.. వీడియో చూశారా..
CSK vs KKR, IPL 2023: ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా.. మ్యాచ్ ఎవరిదైనా.. ఐపీఎల్‌లో ధోనీ పేరు మార్మోగిపోతుంది. అలాంటి వైబ్స్ కేవలం చెన్నై మ్యాచ్‌లోనే కాదు.. ప్రతీ మ్యాచ్‌లోనూ కనిపిస్తున్నాయి.
IPL 2023: ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా.. మ్యాచ్ ఎవరిదైనా.. ఐపీఎల్‌లో ధోనీ పేరు మార్మోగిపోతుంది. అలాంటి వైబ్స్ కేవలం చెన్నై మ్యాచ్‌లోనే కాదు.. ప్రతీ మ్యాచ్‌లోనూ కనిపిస్తున్నాయి. ఇక తాజాగా నిన్న జరిగిన చెన్నై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లోనూ ఇదే కనిపించింది. ఏకంగా లిటిల్ మాస్టర్ గమాస్కర్ షర్ట్‌పైనే ధోనీ ఆటోగ్రాఫ్ ఇవ్వడం కనిపించింది.
చెన్నై ప్లేఆప్స్ చేరాలంటే కేకేఆర్‌తో తప్పక గెలవాల్సింది. కానీ, కోల్‌కతా జట్టు విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా.. చెన్నైలోని చెపాక్‌లో మాత్రం సీఎస్కే జట్టుదే విజయంలా కనిపించింది.
ఇదిలా ఉంటే, IPL 2023లో చెన్నైలో CSKకి ఇదే చివరి గ్రూప్ మ్యాచ్. చెన్నై జట్టు ఇంకా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. దాని క్వాలిఫికేషన్ అవకాశాలు కూడా ఇప్పుడు కాస్త తగ్గాయి. ఎందుకంటే, ఇప్పుడు ఢిల్లీతో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సి ఉంటుంది. లేకపోతే చెన్నై చిక్కుల్లో పడనుంది.
చెపాక్ మైదానం చుట్టూ తిరిగి చెన్నై ఆటగాళ్లు..
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత చెన్నై మైదానంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎంఎస్ ధోనితో సహా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లందరూ చెపాక్ చుట్టూ తిరుగుతూ తమ అభిమానులను పలకరించారు. అభిమానులకు రకరకాల బహుమతులు కూడా అందించారు. ఇందులో జట్టు జెర్సీ నుంచి సంతకం చేసిన టెన్నిస్ బాల్ వరకు ఉన్నాయి. ధోనీ స్వయంగా టెన్నిస్ రాకెట్‌తో కొట్టి, వారికి పంపిణీ చేశాడు.
సునీల్ గవాస్కర్ షర్ట్‌పై ధోనీ ఆటోగ్రాఫ్..
View this post on Instagram
ఇలాంటి సీన్‌లోకి లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఓ సీన్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్రికెట్ అభిమానిలాగే ధోనీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి పరుగున వచ్చాడు. సునీల్ గవాస్కర్ వచ్చిన వెంటనే, ధోనీ మొదట కౌగిలించుకుని, ఆపై ఆయన చొక్కాపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీన్ని బట్టి భారత క్రికెట్‌లో ధోనీ స్థాయి ఎంత పెద్దదో అర్థమవుతుంది. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు.. క్రికెట్ ఫ్యాన్స్ అంతా భావోద్వేగానికి గురవుతున్నారు.
రింకూ సింగ్ జెర్సీపైనా..
మ్యాచ్ అనంతరం KKR ప్లేయర్ రింకూ సింగ్‌కి ధోనీ తన ఆటోగ్రాఫ్ ఉన్న మెమెంటోను బహూకరించాడు. CSKపై KKR విజయానికి హీరో అయిన రింకూ.. ధోనీకి పెద్ద అభిమాని అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..